ఈ నెల 24న 10th హాల్ టికెట్లు విడుదల

ఈ నెల 24న 10th హాల్ టికెట్లు విడుదల

వచ్చే నెల 3 నుంచి 10వ తరగతి పరీక్షలు

ఏప్రిల్ 3 నుంచి జరగనున్న టెన్త్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పిన ఆమె.. ఈ నెల 24 నుంచి వెబ్సైటులో టెన్త్ హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. 4.94 లక్షల మంది విద్యార్థులు రాయనున్న టెన్త్ పరీక్షల కోసం.. సీసీ కెమెరాలు ఉండేలా 2,652 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.