పేటలో.. బీఆర్ఎస్ ప్రభంజనం

పేటలో.. బీఆర్ఎస్ ప్రభంజనం
  • సూర్యాపేట నియోజకవర్గం లొ ‘హస్తం’.. అస్తవ్యస్తం
  • బీఆర్‌ఎస్‌లోకి కొనసాగుతున్న వలసల పర్వం
  • ఎన్నికల ప్రచారంలోనూ వెనుకబడిన కాంగ్రెస్‌
  • గులాబీ కండువాలతో ఆహ్వానం పలికిన మంత్రి జగదీశ్ రెడ్డి
  • తాజాగా ‘గులాబీ’ గూటికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు 

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-సూర్యాపేట నియోజకవర్గం లొ ‘హస్తం’.. అస్తవ్యస్తం అవగా, మంత్రి జగదీష్ రెడ్డి నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభంజనం కొనసాగుతుంది. కాంగ్రెస్, బిజేపి ల నుండి  బీఆర్‌ఎస్‌లోకి  వలసల పర్వం కొనసాగుతుంది. మరోవైపు  ఎన్నికల ప్రచారంలోనూ వెనుకబడిన కాంగ్రెస్‌ నుండి కీలక నేతల ఒక్కరిగా భీ ఆర్ఎస్ లోకి క్యు కడుతున్నారు.తాజాగా ‘గులాబీ’ గూటికి  ఆత్మకూరు కాంగ్రెస్ నాయకులు నంద్యాల సైదిరెడ్డి తో పాటు,సూర్యాపేట రూరల్ ఆరెగూడెం ఉపసర్పంచ్ నాగరాజు 250 మంది కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి సూర్యాపేట టిఆర్ఎస్ అభ్యర్థి గుంటకండ జగదీశ్ రెడ్డి సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. గులాబీ కండువాతో ఆహ్వానం పలికిన మంత్రి అభివృద్ధికి ఆకర్షితులై, జరగబోయే అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వడానికి భీఆర్ఎస్ లో చేరిన వారందరికీ అభినందనలు తెలిపారు.