పఠనోత్సవ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలి- ఎంఈఓ నీలకంఠం

పఠనోత్సవ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలి- ఎంఈఓ నీలకంఠం

ముద్ర ప్రతినిధి, మెదక్: మండల విద్యాధికారి యస్. నీలకంఠం మెదక్ మండల పరిధిలోని ప్రాథమికోన్నత పాఠశాలలు ఖాజిపల్లి, శివాయిపల్లి, ప్రాథమిక పాఠశాలలు వెంకటాపూర్, కొంటుర్ సందర్శించారు. ప్రతి పాఠశాలలో పఠనోత్సవ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, ఇందుకోసం పాఠశాలలో గ్రంథాలయ పీరియడ్ ను కేటాయించాలని సూచించారు.

విద్యార్థులను సామర్థ్యాలవారీగా గ్రూపులు ఏర్పాటు చేసుకొని విద్యార్థులను దత్తత తీసుకోవాలని, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఆవాస ప్రాంతంలోని బడి ఈడు పిల్లలందరు పాఠశాలలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. తరగతి వారీగా విద్యార్థుల పఠన సామర్థ్యాన్ని పరిశీలించారు. ప్రాథమికోన్నత పాఠశాల ఖాజీపల్లిలో మన ఊరు - మన బడి నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.