వర్షంతో ఇబ్బందులు పడుతున్న గొర్రెల కాపరులు

వర్షంతో ఇబ్బందులు పడుతున్న గొర్రెల కాపరులు

వాగులు పొంగడంతో పక్క గ్రామాల్లో ఉండిపోవాల్సి వస్తుందంటున్న గొర్రెల కాపరులు

తుంగతుర్తి ముద్ర: గత పది రోజులుగా తుంగతుర్తి నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గొర్రెల కాపరులు ,పశువుల కాపరులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు .వర్షం కురుస్తున్న లెక్కచేయకుండా జీవాలకు మేత కోసం దూరప్రాంతమైన వర్షంలో తడుస్తూ వెళ్లాల్సి వస్తుందని గొర్రెల కాపరులు చెబుతున్నారు 
ఒక్కోసారి పక్క గ్రామాల శివారు పొలాల్లో జీవాలను మేపుకు తీసుకు వెళ్లాల్సి వస్తుందని అంటున్నారు. అందులో భాగంగా సంగ్యం గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు గ్రామ శివారు దాటి పక్కనే ఉన్న కోడూరు గ్రామ శివారులోని పొలాల్లో గొర్రెల మేతకు వెళ్లడం అదే సమయంలో భారీ వర్షం కురియడంతో సంగం కోడూరు గ్రామాల మధ్య ఉన్న వాగు ఉదృతంగా రావడం తిరిగి గొర్రెలను గ్రామానికి తోలుకు రాలేక కోడూరు శివారులోనే ఉండాల్సి వచ్చిందని గొర్రెల కాపరులు చెప్తున్నారు.

సంగ్యం - కోడూరు గ్రామాల మధ్య ఉన్న వాగుపై బ్రిడ్జి నిర్మాణం అయితేనే తమ సమస్య పరిష్కారం అవుతుందని  లేని పక్షంలో ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి నెలకొంటుందని గొర్రెల కాపరులు అంటున్నారు. వర్షం పడి వాగులు రావడం తిండి తిప్పలు లేకుండా పక్క గ్రామాల్లో ఉండాల్సి వస్తుందని రైతులు సైతం అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.