మెదక్ అడిషనల్ కలెక్టర్ గా జి.రమేష్.. 5 రోజుల్లో తిరిగి జిల్లాకు 

మెదక్ అడిషనల్ కలెక్టర్ గా జి.రమేష్.. 5 రోజుల్లో తిరిగి జిల్లాకు 

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా జి.రమేష్ బదిలీపై వచ్చారు. బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఇక్కడ అదనపు కలెక్టర్(రెవెన్యూ) గా ఉండి ఎన్నికల కమిషన్ సూచన మేరకు హైదరాబాద్ ఎస్జిడిసి -యూఎల్ సికి బదిలీకాగా ఈనెల 21న రిలీవ్ అయిన విషయం తెలిసిందే. మెదక్  స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ బదిలీ కాగా ఆమె స్థానంలో రమేష్ ను తిరిగి జిల్లాకు కేటాయించారు. మంగళవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతలు చేపట్టిన అనంతరం కలెక్టర్ రాజర్షి షాను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.