సోషల్ మీడియాలో  తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు

సోషల్ మీడియాలో  తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు
  • ఎస్పీ రోహిణి ప్రియదర్శిని హెచ్చరిక

ముద్ర ప్రతినిధి, మెదక్:సోషల్ మీడియాలో  విద్వేషకర, రెచ్చగొట్టే, తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన చిత్రాలు, వీడియోలను పోస్ట్ చేయవద్దని, వ్యక్తిగత దూషణకు దిగడం, వార్నింగ్ ఇవ్వడం, అంతర్గత వివరాల గురించి అనవసర పోస్టులు, కామెంట్స్, సోషల్ మీడియాలో పెట్టవద్దని,సమాజంలోని వ్యక్తులపై, సంస్థలపైగాని తప్పుడు, రెచ్చగొట్టే ఆరోపణలు చేసిన, అలాగే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా సామాజిక మాద్యమాలయిన వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాం, టెలిగ్రామ్,  యూట్యూబ్ లాంటి సామాజిక  వేదికగా పోస్టులు చేసిన, షేర్ చేసినా తగిన చర్యలు తప్పవన్నారు.పోలీస్ ఐ.టి సెల్ నెం. 8712657961 తెలియజేయాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచబడతాయన్నారు.