ఉత్తమ అవార్డు అందుకున్న ఎంపీవో, జూనియర్ అసిస్టెంట్, ఘనంగా సన్మానం

ఉత్తమ అవార్డు అందుకున్న ఎంపీవో, జూనియర్ అసిస్టెంట్, ఘనంగా సన్మానం

ముద్ర చివ్వెంల: మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో  ఉత్తమ అవార్డు అందుకున్న ఎంపీవో గోపి జూనియర్ అసిస్టెంట్ దిలీప్, బుధవారం ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో లక్ష్మి మాట్లాడుతూ 77వ స్వాతంత్ర్యం దినోత్సవ సందర్భంగా మంగళవారం సూర్యాపేట జిల్లా ఉత్తమ  ఎంపీవో గోపి, ఉత్తమ జూనియర్ అసిస్టెంట్ దిలీప్, విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి చేతుల మీద అవార్డు అందుకోవడం జరిగింది అన్నారు. ఎం పి ఓ  గోపి, మాట్లాడుతూ నాకు ఈ అవార్డు రావడానికి సహకరించిన జిల్లా అధికారులకి, మండల అధికారులకి ప్రజాప్రతినిధులకు సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్, ఏపీవో నాగయ్య, గ్రామ కార్యదర్శులు, ఉపాధి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు