గృహలక్ష్మి పథకంలో దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారందరికీ ఇళ్లు మంజూరు చేయాలి

గృహలక్ష్మి పథకంలో దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారందరికీ ఇళ్లు మంజూరు చేయాలి
  • సొంత స్థలాలు లేని వారి పేదల పరిస్థితి ఏంటి.
  •  తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు డిమాండ్

ముద్ర చివ్వెంల : సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా 20000 పై చిలుకు గృహలక్ష్మి క్రింద ఇల్లు లేని పేదలు దరఖాస్తు చేసుకున్నారని, అందులో అర్హులైన వారందరికీ ఇళ్లు మంజూరు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి  మట్టి పెళ్లి సైదులు  డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
కేవలం నియోజకవర్గానికి 3,000 ఇల్లు ప్రభుత్వ మంజూరు చేస్తుందని, అవి ఏ మూలకు  సరిపోవని అర్హులైన అందరికీ ఇవ్వాలని, ఆయన డిమాండ్ చేశారు.  సొంత ఇండ్ల స్థలాలు లేని నిరుపేదల సంగతి ఏంటని ఆయనప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం కల్లబొల్లి మాటలు చెబుతూ పేద ప్రజల్ని మోసం చేస్తుందని విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పేదలందరికీ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం మాటలు నమ్మి  పేదలు ఎంతో ఆశతో ఎదురు చూశారని ఆయన అన్నారు.