ప్రైవేట్, కార్పోరేట్ శక్తుల నుండి విద్యారంగాన్ని రక్షించుకుందాం.     

ప్రైవేట్, కార్పోరేట్ శక్తుల నుండి విద్యారంగాన్ని రక్షించుకుందాం.     

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట:-తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా సమస్యలు పరిష్కారమవుతాయని విద్యార్థులు, ప్రజలు ప్రాణాలు పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించుకొని తొమ్మిది ఏళ్ళు గడిచిందని, ఉద్యమ ఆకాంక్షలను మేము అధికారంలోకి రాగానే నెరవేరుస్తామని చెప్పిన నేటి పాలకులు ఏ ఒక్క హామీని అమలు చేయకుండ, సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలు జరపడంమేంటి అని పిడిఎస్ ఎఫ్  రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నాగరాజు ప్రశ్నించారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో  ఆయన మాట్లాడుతూ కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యను అందించి,కామన్ స్కూల్ విధానాన్ని తీసుకొస్తామని చెప్పి, నేడు ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే కుట్రకు పూనుకున్నారన్నా రు, ఫీజుల నియంత్రణ చేయకుండా పూర్తిగా ప్రైవేట్, కార్పోరేట్ మాఫియాకు అప్పజెప్పి విద్యను అంగడి సరుకుగా మార్చేసారని ప్రభుత్వ విద్యాసంస్థల్లో కనీసం వసతులు కూడా కల్పించకుండా,ఆర్భాటాలు, ప్రకటనలతో సరిపెట్టారని విమర్శించారు. బడ్జెట్లో నిధుల కేటాయింపు లేదని,పక్కా భవనాలు, తరగతి గదులు, పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు లేవని ఉపాధ్యాయులు,లెక్చరర్స్ ప్రొఫెసర్స్ కూడ సరిపడ లేరని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా పాలకులు విద్యార్థి వ్యతిరేక విధానాలను మానుకోవాలని, విద్యారంగ సమస్యలను పరిష్కరించి, కనీస మౌలిక వసతులను కల్పించాలని ,రాష్ట్ర వ్యాప్తంగా వున్న అధ్యాపక, అన్ని విభాగాల ఖాళీలు భర్తీ చేయాలని,ప్రైవేట్,కార్పోరేట్ విద్యాసంస్థలను స్వాధీనం చేసుకోని, కేజీ టు పీజీ ఉచిత విద్యను ప్రవేశపెట్టాలని ,దానికి ముందుగా అధిక ఫీజులు,డొనేషన్లు,అక్రమ వసుళ్లను అరికట్టాలని డిమాండ్ చేశారు. కామన్ స్కూల్ విధానాన్ని తీసుకురావాలి అని లేనియెడల విద్యార్థుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆర్,పృథ్వీరాజ్, క్రాంతి, హరీష్, గుండెబోయిన ప్రశాంత్, ప్రవీణ్, లు పాల్గొన్నారు.