పరిసరాల పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలి

పరిసరాల పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలి
  • మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, 45 వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్
  • సూర్యాపేట పట్టణంలోని 45 వ వార్డులో  ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట - సూర్యాపేట పట్టణంలోని ప్రతి వార్డులో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం నిర్వహించి డ్రెయినేజీలలోని చెత్త, వ్యర్ద పదార్దలను తొలగిస్తున్నట్లు మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ అన్నారు. బుధవారం నాడు 45 వ వార్డు విద్యానగర్ నందు నిర్వహించిన ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం లో వార్డు కౌన్సిలర్ గండూరి పావని క్ర్రపాకర్ తో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదేశాల మేరకు సూర్యాపేట పట్టణంలోని ప్రతి వార్డులో వర్షాకాలానికి ముందే డ్రెయినేజీ ల పూడికతీత పనులు చేపడుతున్నట్లు చెప్పారు.

 ప్రజలు తమ ఇంటితోపాటు పరిసరాలు పరిశుభ్రంగా వుంచాలని, డ్రెయినేజీ కాలువలలో వ్యర్దాలను వేయడం వలన దోమలు చేరి రోగాల బారిన పడవలసి వస్తుందని, కాబట్టి ఇంట్లోని తడి చెత్తను మున్సిపాలిటీ ట్రాక్టరు కు ఇవ్వాలని అన్నారు. పొడిచెత్త అనగా పాత పుస్తకాలు, ప్లాస్టిక్ వ్యర్దాలు మున్సిపాలిటీ RRR కేంద్రంలో విక్రయించి కిలో కు  5/- నగదు పొందాలని అన్నారు.  45 వ వార్డులో వేసవి సెలవులలో 100 మంది విద్యార్థులకు చెస్ ఆటలో శిక్షణ ఇస్తున్న బిఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు గండూరి క్ర్రపాకర్ కు అభినందనలు తెలిపారు. 

ఈ  కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ రామాంజుల రెడ్డి, బిఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు గండూరి కృపాకర్,   నూకల వెంకట రెడ్డి, మీలా వంశి, వైద్యులు డాక్టర్ తోట కిరణ్, డాక్టర్ దేవరశెట్టి దినేష్, ప్రభాకరాచారి, మున్సిపాలిటీ ఎస్ ఐ శ్రీనివాస్, జవాను కొండేటి వెంకన్న, కుక్కడపు సాలయ్య, భిక్షం, ఇస్మాయిల్, కళ్యాణ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.