అలుపెరగని యోధుడు ధర్మ బిక్షం

అలుపెరగని యోధుడు ధర్మ బిక్షం

 సూర్యాపేట, ఫిబ్రవరి 15: సాయుధ పోరాటయోధుడు, పార్లమెంట్ మాజీ సభ్యుడు, సిపిఐ నాయకుడు బొమ్మగాని  ధర్మబిక్షం 101జయంతి  సందర్భంగా  సూర్యాపేట పట్టణంలో వివిధ సంఘాలు ఘనంగా నివాళులు అర్పించాయి. ధర్మభిక్షం చౌక్ వద్ద ఆయన విగ్రహానికి విద్యార్ధి జనసమితి (VJS)జిల్లా అధ్యక్షుడు బొమ్మగాని వినయ్ గౌడ్, రాష్ట్రీయ విద్యార్థి సేన పరిషత్ (RVSP) రాష్ట్ర అధ్యక్షులు బంటు సందీప్ గౌడ్, AISF జిల్లా అధ్యక్షులు గోపగాని రవి కుమార్ గౌడ్ పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ధర్మభిక్షం సూర్యాపేట నియోజకవర్గ తొలి శాసనసభ్యుడిగా, నకిరేకల్, నల్గొండ శాసనసభ్యునిగానూ, రెండు పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగానూ గెలిచి  విద్యార్థులకు  , కార్మికులకు, గీత పనివారలకు నిరంతర సేవలందించారని వారు కొనియాడారు.