సమాజ హితంకోసం పనిచేసిన వారు చిరస్మరణీయులు 

సమాజ హితంకోసం పనిచేసిన వారు చిరస్మరణీయులు 

సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే: జూలకంటి రంగారెడ్డి

హుజూర్ నగర్, ముద్ర: జీవించిన కాలంలో సమాజ హితం కోసం, పేదల తరఫున వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేసిన వారు చరిత్రలో చిరస్మరణీయులని ఆ కోవకు చెందిన నాయకుడు పులిచింతల వెంకటరెడ్డి అని సిపిఐ (ఎం ) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్ లో జరిగిన సంతాప సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కమ్యూనిస్టు పార్టీలో  తుది శ్వాస  విడిచెంతవరకు కొనసాగడం అనేది గొప్పతనం అని కొనియాడారు. అన్ని వర్గాల ప్రజల బాగు కోసం పోరాడే ఎర్రజెండా నీడలో వెంకటరెడ్డి పార్టీ నాయకునిగా, ప్రజాప్రతినిధిగా అనునిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేశాడని అన్నారు.  ఆయకట్టు ప్రాంతంలో ధాన్యం తూకాలలో జరుగుతున్న మోసాల పైన,సాగునీటి కోసం ఆయన చేసిన కృషి చరిత్రలో నిలిచిపోయిందన్నారు.

ఆదర్శవంతమైన వ్యక్తి వెంకటరెడ్డి..

   తుది శ్వాస విడిచేంతవరకు స్థానిక సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన పులిచింతల వెంకటరెడ్డి జీవితం ఆదర్శవంతమైందని సిపిఐ (ఎం )జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు .సోమవారం ఆయన స్థానికంగా జరిగిన వెంకటరెడ్డి సంతాప సభలో పాల్గొని మాట్లాడారు. పార్టీ అభివృద్ధి కోసం తన శక్తి సామర్థ్యాలను ఉపయోగించి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ముందుకు వెళ్లిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు .అనంతరం పలువురు అఖిలపక్ష నాయకులు సంతాప సభలో మాట్లాడారు.    అదేవిధంగా నల్గొండ పార్లమెంటు సభ్యులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంకటరెడ్డి చిత్రపటం వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగారపు పాండు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, పారేపల్లి శేఖర్ రావు  దీరావత్ర వి నాయక్,  కొలిశెట్టి యాదగిరిరావు,మేదరమట్ల వెంకటేశ్వరరావు, బుర్రి శ్రీరాములు, కాంగ్రెస్ నాయకులు ఎరగాని నాగన్న గౌడ్ ,నిజాముద్దీన్ ,దొంగరి వెంకటేశ్వర్లు,సిపిఐ నాయకులు పాలకూరి బాబు, మామిడి వెంకటేశ్వర్లు, న్యూ డెమోక్రసీ నాయకులు మేకల నాగేశ్వరరావు, బిఆర్ఎస్ నాయకులు అట్లూరి హరిబాబు, గొట్టె వెంకటరామయ్య, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పల్లె వెంకటరెడ్డి ,దుగిబ్రహ్మం,  వట్టెపు సైదులు, భూక్య పాండు నాయక్, కే.అనంత ప్రకాష్,కె. నగేష్, నరసయ్య, ముత్యాలు, బెల్లంకొండ సత్యనారాయణ, మండల కార్యదర్శులు పోసనబోయిన హుస్సేన్, మాలోతు బాలు నాయక్, పట్టణ కార్యవర్గ సభ్యులు తుమ్మకొమ్మయోన, జక్కుల వెంకటేశ్వర్లు, రేపాకుల మురళి కృష్ణ ,చిన్నం వీరమల్లు ,పాశం నరసయ్య, వెంకటనారాయణ, జగన్మోహన్ రెడ్డి ,తుమ్మల సైదయ్య ,వీరయ్య, వెంకటచంద్ర తదితరులు పాల్గొన్నారు.