సీఎంఆర్ బకాయిలు సకాలంలో పూర్తి చేయాలి

సీఎంఆర్ బకాయిలు సకాలంలో పూర్తి చేయాలి

 జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: సీఎంఆర్ బకాయిలు సకాలంలో పూర్తి  చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు ఆదేశించారు గురువారం జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా రైస్ మిల్లు యజమానులతో సమావేశం నిర్వహించారు రబి 2021-22 సీజన్లో సీఎంఆర్ బకాయిలు ఉన్న మిల్లర్లు గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు 32,045 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని గడువులోగా డెలివరీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా ధాన్యం దిగుమతులలో కూడా ఆలస్యం లేకుండా మిల్లులకు వచ్చిన వెంటనే ధాన్యం దిగుమతి చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రెవెన్యూ ఎస్ మోహన్ రావు,డిఎస్పి నాగభూషణం, డి ఎం సివిల్ సప్లై బి. రాంపతి, డీఎస్ఓ పుల్లయ్య, రైస్ మిల్లుల యజమానులు అసోసియేషన్ సభ్యులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.