బీసీలకు జనాభా ప్రాతిపదికన ఎమ్మెల్యే టిక్కెట్ లు ఇవ్వాలి

బీసీలకు జనాభా ప్రాతిపదికన ఎమ్మెల్యే టిక్కెట్ లు ఇవ్వాలి


ముద్ర ప్రతినిధి సూర్యాపేట: రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో   రాష్ట్రంలో జానాభా ప్రాతిపదికనబీసీలకు ఎమ్మెల్యే టిక్కెట్ లు ఇవ్వాలని బీసీ  సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కిష్టయ్య అన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని గాంధినగర్ లో డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్య తో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ ఎస్ పార్టీ తరఫున అసెంబ్లీ కి పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. 10 శాతం జనాభా ఉన్న అగ్రకులాలకు 60  టిక్కెట్ లు ఇవ్వడంతో  సీఎం కేసీఆర్  బీసీలకు అన్యాయం చేశారని ఆయన అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ బీసీలకు న్యాయం జరగడం లేదన్నారు. చట్ట సభలలో బీసీలకు అవకాశం రాకుండా అగ్రకులాల నాయకులు అడ్డుకుంటున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో  పోటీ చేసే బీసీ అభ్యర్థులకు మద్దతుగా పెద్దఎత్తున ప్రచారం చేస్తామని కిష్టయ్య అన్నారు.  త్వరలోనే సూర్యాపేట జిల్లా కేంద్రంలో బిసిల ఐక్యతను చాటుతూ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని అన్నారు.  ఈ కార్యక్రమంలో పలువురు బీసీ సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.