మండల ప్రకటనలో జాప్యమెందుకు

మండల ప్రకటనలో జాప్యమెందుకు
  • గోరికొత్త పల్లి మండలం ప్రకటన చేయాలి 
  • బీజేపీ ఆధ్వర్యంలో ఒక్క రోజు దీక్ష వంట వార్పు

ముద్ర న్యూస్ రేగొండ: రేగొండ మండలాన్ని రెండు మండలలుగా విభజించి గొరికొత్తపల్లి గ్రామాన్ని నూతన మండలంగా ప్రకటిస్తామని చెప్పి రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు గోరికొత్త పల్లి మండలంగా ప్రకటించక  పోవడాన్ని నిరసిస్తూ శనివారం  బీజేపీ మండల అధ్యక్షులు  దాసరి తిరుపతి రెడ్డి,  అధ్యర్యంలో గోరికొత్త పల్లి గ్రామంలో  ఒకరోజు దీక్ష వంటవార్పు నిర్వహించారు.   ఈ  కార్యక్రమనికి ముఖ్య అతిధిగా  రాష్ట్ర  అధికార ప్రతినిది చందుపట్ల కిర్తి రెడ్డి, హాజరై ఒక్క రోజు దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ   గొరికొత్తపల్లి  గ్రామాన్ని  మండలం చెస్తాంమని చేప్పి ప్రగల్బాలు పలికి  ప్రజలను మోసం చేస్తు మండలం చేయకపోవడం కాకుండా  ఉన్న పోలీస్ స్టేషన్ లేకుండా చేసారు. దసరా పండుగ రోజు ఆర్భాటంగా రాష్ట్ర మంత్రులతో మండలాన్ని ప్రకటించి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని చెప్పిన నాయకులు ఇప్పటి వరకు మండలాన్ని ఎందుకు జాప్యం జరుగుతోందని ప్రశ్నించారు.

గత నెలలో కె టి ఆర్ భూపాలపల్లి పర్యటన సందర్భంగా సభలో ఇచ్చిన హామీ ఏమైంది అని ఎన్నికల వరకు మండలాన్ని ప్రకటించకుండా అపి ఓట్లు దండుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అని హెద్దేవా చేశారు. బీజేపీ అధ్యర్యంలో దీక్ష  చేస్తున్నారు అని తెలుసుకొని  రెండు రోజుల్లో  గెజిట్  తీసుకొని  వస్తానని ప్రచారం జరుగుతోందని  ఎనిమిది నెలలు ఆగినాము రెండు రోజుల్లో గెజిట్  తీసుకురాకపోతే ఎమ్మెల్యే ను  అడ్డుకుంటాంమని హెచ్చరించారు. ఈ  కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి  ఏడునూతుల నిషిధర్ రెడ్డి.ఉపాధ్యక్షులు లింగంపల్లి ప్రసాద్ రావు,. కిసాన్ మోర్చ్ జిల్లా అధ్యక్షులు, తిరుపతి రావు,. జిల్లా కార్యదర్శి సుంకరి మనోహర్. మెతుకుపల్లి బుచ్చి రెడ్డి. మండల ప్రధాన కార్యదర్శి. పెండల రాజు,  శక్తి కేంద్ర ఇంచార్జ్. ఓమాజీ. బామ్మ తిరుపతి. దాసరి అనిల్. సూర్యం బోడకుంట్ల అశోక్, రాంబాబు.  విమల భయ్. తుమ్మల దామోదర్. నరేష్. తదితరులు పాల్గొన్నారు.