వడ్ల ట్రాక్టర్​ని ఢీకొట్టిన లారీ: మహిళా రైతు మృతి

వడ్ల ట్రాక్టర్​ని ఢీకొట్టిన లారీ: మహిళా రైతు మృతి

ముద్ర ప్రతినిధి,  సూర్యాపేట : సూర్యాపేట శాంతినగర్ వద్ద  శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో  మహిళా  రైతు మృతి చెందింది. చివ్వెంల మండలం పాండ్యా నాయక్ తండాకు చెందిన మహిళా రైతు ధారావత్ భద్రమ్మ వడ్ల లోడుతో ట్రాక్టర్ పై సూర్యాపేటకు వస్తుండగా అతివేగంగా హైదరాబాదు నుండి వస్తున్న  లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది.  వడ్ల ట్రాక్టర్ ఒకసారిగా  ప్రమాదానికి గురికావడంతో ట్రాక్టర్ లో ఉన్న వడ్లన్నీ రోడ్డుపై   చెల్లాచెదురుగా పడడమే కాకుండా అదే వడ్లలో భద్రమ్మ పడి మృతి చెందింది.