CEIR నూతన అప్లికేషన్ ద్వారా మొబైల్ ఫోన్ల స్వాధీనం.

CEIR నూతన అప్లికేషన్ ద్వారా మొబైల్ ఫోన్ల స్వాధీనం.
  • పోగొట్టుకున్న, చోరికి గురైన 4.5 లక్షల విలువగల 23 మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్న  జిల్లా పోలీసులు.
  • మొబైల్ ఫోన్ పోయిన చోరికి గురైనా www.ceir.gov.in పోర్టల్ నందు పిర్యాదు చేసుకోండి.*
  • పోయిన మొబైల్స్ ను CEIR నందు రిజిస్టర్ చేయడం ఒక సామాజిక బాధ్యత.
  • CEIR పోర్టల్ ద్వారా స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ 
  • జిల్లా పోలీసు కార్యాలయం నందు ఏర్పాటుచేసిన మీడియా సమావేశం నందు ఫోన్ల రికవరీ నీ వివరించిన జిల్లా ఎస్పీ గారు.

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: పోయిన, దొంగలించబడిన మొబైల్ ఫోన్లను త్వరితగతిన పట్టుకోవడానికి  CEIR (Central equipment identity register) అనే వెబ్ సైట్  లో సంబంధిత వివరాలను నమోదు చేసుకున్నట్లైతే అలాంటి మొబైల్స్ ను ఈ పోర్టల్ ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉంటుందని ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు. ఈ పోర్టల్ నిర్వహణకు సంబంధించి అన్ని పోలీస్ స్టేషన్ల నందు పోలీసు నోడల్ అధికారులను ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇవ్వడం జరిగినది అన్నారు. ఈ పోర్టల్ యొక్క ఆవశ్యకతను తెలుపుతూ ప్రజలకు అవగాహన కల్పించామని, చాలా మంది వినియోగదారులు వారి పోయిన మొబైల్స్ వివరాలను ఈ రిపోర్టర్ వివరాలను నమోదు చేసుకోవడం జరిగినదని చెప్పారు. వినియోగదారులు నమోదు చేసుకున్న వివరాల ప్రకారం పోలీస్ స్టేషన్లో నోడల్ అధికారులు జిల్లా వ్యాప్తంగా 4 లక్షల 50 వేల రూపాయల విలువగల 23 మొబైల్స్ ను రికవరీ చేయడం జరిగిందనీ తెలిపినారు.

వినియోగదారులు ఎవరైనా మొబైల్స్ పోగొట్టుకున్న, వారి మొబైల్ చోరీకి గురైన వెంటనే సంబంధిత వివరాల్లో IMEI, మొబైల్ నంబర్, బిల్, మీ సేవా రశీదు, పోలీస్ స్టేషన్, మండలం, జిల్లా, రాష్ట్రం, పిన్ కోడ్ మొదలగు వివరాలతో ఈ పోర్టల్ నందు నమోదు చేసుకోవాలన్నారు. ఇలా నమోదు చేయడం వల్ల ఫోన్ IMEI బ్లాక్ చేయబడి ఫోన్ పని చేయదని, ఇందులో ఎవరైనా సిమ్ కార్డ్ వేసుకుంటే ట్రేసబులిటి రిపోర్ట్ వస్తుందని, దీని ఆధారంగా పోయిన మొబైల్ లొకేషన్ గుర్తించి స్వాధీనం చేసుకోవచ్చుని వివరించారు. పోయిన సెల్ ఫోన్ లను అశ్రద్ద చేస్తే ఫోన్ లో ఉన్న వ్యక్తి గత ఆధారాలు దొంగిలించి నష్టాన్ని కలగజేస్తాయని, ఇది వ్యక్తి గత భద్రతకు, సామాజిక భద్రతకు భంగం కలుగుతుందని వెల్లడించారు దొంగిలించిన ఫోన్ లతో నేరాలకు పాల్పడే అవకాశం ఉన్నదని, కావున ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా CEIR పోర్టల్ నందు  నమోదు చేసుకోవాలని కోరారు.
- స్వాధీనం చేసుకున్న మొబైల్స్.
1) పెనపహడ్ PS  -  7
2) సూర్యాపేట 2వ పట్టణ PS - 3
3) కోదాడ రూరల్ PS  -    3
4) సూర్యాపేట రూరల్ PS- 2
5) పాలకవీడు PS - 2
6) సూర్యాపేట 1వ పట్టణ PS - 2
7) కోదాడ టౌన్ PS  -   1
8) తుంగతుర్తి PS -1
9) నూతనకల్ PS - 1
10) మోతే PS -  1

ప్రజలు ఎవరైనా మోబైల్స్ పోగొట్టుకున్న, దొంగిలించబడిన వెంటనే CEIR నూతన అప్లికేషన్ లో వివరాలు నమోదు చేసుకోవాలి అని కోరినారు. 

మొబైల్ ఫోన్ల ను రికవరీ చేసిన పోలీసు అధికారులను, నోడల్ అధికారులను అభినందిస్తున్నానని, బాగా పని చేసిన సిబ్బంది అందరికీ సర్వీస్ రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది అన్నారు. ఈ సందర్భంగా ఎక్కువ మొబైల్స్ రికవరీ చేసిన పెనపహాడ్ SI  టీమ్ ను అభినందించి రివార్డ్ అందించారు.

ఈ కార్యక్రమం నందు DSP లు నాగభూషణం, వెంకటేశ్వర రెడ్డి , DCRB DSP రవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, DCRB ఇన్స్పెక్టర్ నర్సింహ, CI రాజేష్, ఆంజనేయులు, రామలింగారెడ్డి, రాఘవులు, నాగర్జున, Ri లు శ్రీనివాస్, శ్రీనివాస్ రావు, నర్సింహారావు, గోవిందరావు, SI లు సత్యనారాయణ, హరికృష్ణ, రవీందర్, నోడల్ అధికారులు, మొబైల్స్ బాధితులు ఉన్నారు.