జాతీయ లోక్ అదాలత్ లో  17,935 పెండింగ్ కేసులు పరిష్కారం

జాతీయ లోక్ అదాలత్ లో  17,935 పెండింగ్ కేసులు పరిష్కారం

పోలీస్ పని విభాగాల (ఫంక్షనల్ వర్టికల్) నిర్వహణలో జిల్లా పోలీసు ప్రథమ స్థానం, అభినందించిన DGP - ఎస్పీ రాజేంద్రప్రసాద్

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయం నందు అదనపు ఎస్పీ నాగేశ్వరరావు,డిఎస్పి సిఐ లతో కలిసి ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఐపీఎస్  నెలవారి పోలీస్ అధికారుల సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగినది. ఈ సమీక్ష సమావేశం నందు గత నెలలో నమోదైన కేసుల వివరాలు పెండింగ్ కేసులు కేసుల పురోగతి, కమ్యూనిటీ కార్యక్రమాలు, పోలీసు పని విభాగాల నిర్వహణ మొదలగు అంశాలపై సమీక్షించడం జరిగినది. పని విభాగాల నిర్వహణలో గత నెలలో జిల్లా పోలీస్ శాఖ తొమ్మిది పని విభాగాల నందు రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచినదని దీనికి  రాష్ట్ర DGP  అభినందించారని చెప్పారు.

శనివారం రోజున జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమంలో నందు జిల్లా వ్యాప్తంగా 17935 కేసులను పరిష్కరించామని ఎస్పీ  తెలిపారు. ఈ లోక్ అధలత్ కార్యక్రమం కు ముందు పదిహేను రోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, కేసులను గుర్తించి, విభజించి, ఖచ్చితమైన ప్రణాళికతో పెద్ద మొత్తంలో కేసులను పరిష్కరించగలిగామని ఎస్పీ  అన్నారు. కోర్టు డ్యూటీ సిబ్బంది స్టేషన్ అధికారులు ఇన్స్పెక్టర్స్ డిఎస్పీలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం ద్వారా పనిచేయడం వల్ల లోక్ ఆదాలత్ కార్యక్రమంలో పెండింగ్ కేసులను పరిష్కరించ గలిగామని బాగా పనిచేసిన సిబ్బంది అందరినీ ఎస్పీ అభినందించారు. 

సిబ్బంది అందరూ సమన్వయంతో క్రమశిక్షణతో పనిచేయాలని బాధితులకు సత్వర న్యాయం జరిగేలా ప్రణాళిక ప్రకారం పని చేయాలని ఆదేశించారు. పరిస్థితులకు అనుగుణంగా పనిచేస్తూ ముందుకు వెళ్లాలని కోరారు. పోలీస్ పని విభాగాల నిర్వహణలో మరోసారి ప్రతిభ చూపిన సూర్యాపేట జిల్లా పోలీస్.

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న పోలీసు పనికి భాగాలు ఫంక్షనల్ వర్టికల్స్ నందు జిల్లా పోలీస్ శాఖ 9 పని విభాగాలలో రాష్ట్రంలో కష్టపత్రి విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఐపీఎస్  ఆధ్వర్యంలో పని విభాగాలను పర్యవేక్షణ చేసిన DCRB DSP రవికి రాష్ట్ర DGP కార్యాలయం నుండి ప్రశంసా పత్రాన్ని అందజేసి  DSP రవి కి ప్రశంసా పత్రాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపినారు. సిబ్బంది అందరూ సమిష్టిగా పని చేయడం వల్ల ఈ ఘనత దక్కింది  అనిఎస్పీ అన్నారు.

ఈ సమావేశం నందు అదనపు ఎస్పి నాగేశ్వరరావు, డీఎస్పీలు నాగభూషణం ప్రకాష్ రవి శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు రాజేష్, మహేష్, నాగార్జున, సర్కిల్ ఇన్స్పెక్టర్ లు శివ శంకర్, రామలింగ రెడ్డి, వీరరాఘవులు, రాజశేఖర్, రామకృష్ణా రెడ్డి, అశోక్, బ్రహ్మ మురారి, రాము, ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు