మఠంపల్లి బి ఆర్ యస్ యూత్ అధ్యక్షుడు గ వెంకటరెడ్డి 

మఠంపల్లి బి ఆర్ యస్ యూత్ అధ్యక్షుడు గ వెంకటరెడ్డి 

మఠంపల్లి ,ముద్ర: బి ఆర్ యస్ యూత్ అధ్యక్షుడు గ చౌటపల్లి గ్రామానికి చెందిన బూసిపెల్లి వెంకటరెడ్డి ని నియమిస్తూ హుజుర్ నగర్ ఎమ్మెల్యే  శానం పూడి సైదిరెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బి ఆర్ యస్ యువత కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుందని తెలిపారు. యువతను చైతన్య పరుస్తూ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో బి ఆర్ యస్ మండల పార్టీ అధ్యక్షుడు ఇరుగు పిచ్చయ్య, ఉపాధ్యక్షుడు వెంకటరెడ్డి, షోషల్ మీడియా కన్వీనర్ బేత శివారెడ్డి, ఇమ్మానియెల్ ఉన్నారు.