10లక్షల సీసీ రోడ్ పనులు ప్రారంభించిన ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి

10లక్షల సీసీ రోడ్ పనులు ప్రారంభించిన ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, మెదక్: శంకరంపేట్ (ఆర్) మండలం గవ్వలపల్లి గ్రామ పంచాయతీలో తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల  నుంచి మంజూరు చేసిన 10 లక్షల రూపాయల సీసీ రోడ్ పనులను సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ యాదవ రావు, ఎఎంసి మాజీ చైర్మన్ గంగా నరేందర్, స్థానిక ఉపసర్పంచ్ రాం రెడ్డి, మండలంలోని సర్పంచులు పోచయ్య, రాజా సింగ్, మండల పార్టీ సీనియర్ నాయకులు సాన సత్యనారాయణ, రంగారావు, పడాల సిద్దిరాములు, ఖాజాపూర్ భిక్షపతి(గుడ్డు), పీఏసీఎస్ చైర్మన్లు శ్రీనివాస్ రెడ్డి, చింతల సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీలు ప్రతాప్ రెడ్డి, నాగరాజు, పార్టీ నాయకులు బాబూరావు, నర్సింహారెడ్డి, శ్రీశైలం, యువ నాయకులు కరుణాకర్, గ్రామ పంచాయతీ పాలక వర్గం తదితరులు పాల్గొన్నారు.