కవిత ఎంపీ ఉత్తమ కుమార్ రెడ్డిని విమర్శించే స్థాయి నీదా..?

కవిత ఎంపీ ఉత్తమ కుమార్ రెడ్డిని విమర్శించే స్థాయి నీదా..?
  • ఎంపీపీ కవిత రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి
  • దళిత బందులో అడ్డగోలుగా డబ్బులు దోచుకున్నావు
  • నిరూపించు నిరూపించు అన్నావు కదా సాక్షాలతో సహా మా దగ్గర ఉన్నాయి
  • గుడిబండలో నియంత పాలన కొనసాగిస్తున్నావు
  • నాయి బ్రాహ్మణులది స్థలం ఆక్రమించింది నువ్వు కాదా..
  • కాపుగల్లు రోడ్డు లో ఉన్న స్థలనా ఆక్రమించింది నువ్వు కాదా...
  • భర్త ఎవరో చెప్పు కోలేని పరిస్థితి నీది...
  • దేశం కోసం పనిచేసిన ఉత్తంకుమార్ రెడ్డిని నువ్వు విమర్శిస్తున్నావా?
  • దళిత బందు పధకం లో నష్టపోయిన వారికి న్యాయం జరగాలి

కోదాడ, ముద్ర: కోదాడ ఎంపీపీ చింత కవితా రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, క్యాబినెట్ మంత్రిగా ,టిపిసిసి అధ్యక్షులుగా ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని విమర్శించే స్థాయి నీదా... ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూసి ఊరుకోడానికి ఎవరూ లేరు అంటూ కాంగ్రెస్ పార్టీ కోదాడ మండల అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి ఎంపీపీ కవితపై ఘాటుగా విమర్శలు చేశారు. దళిత బంధు పధకం లో జరిగిన అవినీతి పై విచారణ జరిపించాలని కోరుతూ బుధవారం గుడిబండ గ్రామంలో అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... .రాధా రెడ్డి నా భర్త కాదు అని కోర్టు లో చెప్పిందానివి.... భర్త ఎవరో చెప్పు కోలేని పరిస్థితి నీది...నీకు ఎంపీ ని విమర్శించే స్థాయి కాదని హితవు పలికారు. గుడిబండ గ్రామంలో 451,452 సర్వే నెంబర్లు ఎకరం ఏడు గుంటల భూమి,222 సర్వే నెంబర్లు 30 కుంటల భూమిని ఆక్రమించుకున్న నువ్వు కాదా. అంటూ ఆరోపణలు చేశారు...  .అవినీతి చేసింది నువ్వు కాదా గురుగింజ సామెత ల ఉంది నీ వ్యవహారం అని ఎద్దేవా చేసారు. వీళ్లందరు సాక్ష్యం కాదా ముక్కు నేలకు రాసుకుంటావా అని ప్రశ్నించారు.ఈ సందర్భంగా కొందరు  బాధితులు ఎంపిపీ కాంగ్రేస్ వారి పై పన్నుతున్న కుట్రలను  మీడియా ముందు చెప్పారు. 

కాంగ్రేస్ వాళ్ళు డబ్బులు ఇచ్చి లబ్ధిదారులతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని కవిత విలేకరుల సమావేశంలో చేసిన ఆరోపణలను ఖండించారు. కాంగ్రేస్ వాళ్ళు ఎవరు డబ్బులు ఇవ్వలేదని బాధితులు మీడియా ముందు చెప్పారు.ఎంపిపీ నిన్న కారులో వచ్చి సిద్దు నువ్వు వాళ్లు డబ్బులు ఇచ్చి వ్యతిరేకంగా చెప్పిచ్చారంటూ  ప్రతిపక్ష వాళ్ళ మీద నెట్టు నీకు డబ్బులు ఇస్తానని చెప్పి సిద్ధూ ఒత్తిడికి గురిచేసి బెదిరింపులకు పాల్పడుతుంది నువ్వే కదా... మరి ఇది నిజం కాదు అంటే గ్రామంలో బొడ్రాయి వద్ద ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్న... మరి మీరు ప్రమాణం  చేస్తావా అని ఒక బాధితుడు సవాలు విసిరాడు.ఈ సమావేశంలో ఇర్ల సీతారాం రెడ్డి, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు  పులి రాజారావు, గ్రామ శాఖ అధ్యక్షుడు ఎస్కే రఫీ, కుక్కడపు సైదులు, రామకృష్ణారెడ్డి, గొర్రె ముచ్చుసిద్దు, మర్రి ఏసమ్మ, కొప్పు పద్మ, ఉదరా అశ్విని, ఉదర  రమణ, మాదాసు శ్రీను ,భిక్షం తదితరులు పాల్గొన్నారు.