స్వయం ఉపాధితో మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలి

స్వయం ఉపాధితో మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలి

రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్

ముద్ర, ముషీరాబాద్: స్వచ్ఛంద సంస్థలు అందించే ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకొని మహిళలు స్వయం ఉపాధిని ఎంచుకొని ఆర్థిక ప్రగతిని సాధించాలని రాజ్యసభ సభ్యులు బిజెపి ఓబీజీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ సూచించారు. గాంధీనగర్ డివిజన్ త్యాగరాయ గానసభలోని మిని ఆడిటోరియంలో లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ప్యారడైజ్ వారి అధ్వర్యంలో బుధవారం మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్య సభ సభ్యులు, ఓబీసీ మోర్చ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ హాజరై  గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎనుగు పావని, కవాడిగుడా డివిజన్ కార్పొరేటర్ రచనశ్రీలతో  కలసి మహిళలకు కుట్టు మిషన్లు స్వయం ఉపాధి కోసం పలు వృత్తులపై శిక్షణ పొందిన గృహిణులకు సర్టిఫికేట్లు ప్రధానం చేశారు. 

అనంతరం డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలలో ఎల్లపుడూ అగ్రగామిగా, ప్రజలకు ఎన్నో రకాల సేవలను అందిస్తోన్న Lions Club of Secunderabad Paradise లయిన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ప్యారడైజ్ వారిని ఈ సందర్భంగా అభినందించారు. స్వయం ఉపాధి శిక్షణల ద్వారా ప్రతి మహిళ నైపుణ్యాన్ని సంపాదించడంతో పాటు తన కుటుంబానికి ఆర్థిక బలాన్ని చేకూర్చలని అన్నారు. మహిళా సాధికారత దిశగా వారి అభ్యున్నతి కొరకు బీజేపీ తరపున తాము ఎల్లపుడూ ముందుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నగర నాయకులు ఎనుగు వినయ్ కుమార్, అసెంబ్లీ కన్వీనర్ రమేశ్ రామ్,  డివిజన్ అధ్యక్షుడు రత్న సాయి చంద్, సీనియర్ బిజెపి నాయకులు వెంకటేష్, పరిమళ్ కుమార్, మహిళ నాయకులు తులసి, సంధ్యా రాణి, స్వప్న, పూర్ణ,  నిర్వాహకులు లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ప్యారడైజ్ అధ్యక్షులు జయంత్ సింఘ్, కార్యదర్శి వి.మధు, కోశాధికారి ప్రకాష్, ప్రాజెక్ట్  ఛైర్మెన్ గణేష్ పద్మశాలి పాల్గొన్నారు.