వీధి వ్యాపారులకు అండగా ఉంటాం

వీధి వ్యాపారులకు అండగా ఉంటాం

బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి సంకినేని వరుణ్ రావు

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: వీధి వ్యాపారులకు అండగా ఉంటామని బిజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి సంకినేని వరుణ్ రావు అన్నారు. శనివారం రాత్రి  జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద సంకినేని వెంకటేశ్వరరావు జన్మదిన సందర్భంగా వీధి వ్యాపారులకు గొడుగులు పంపిణీ చేసి, కేక్ కట్ చేసి మాట్లాడారు. 2014 తర్వాత అనేకమంది వీధి వ్యాపారులు చెట్ల కింద ఉండి వ్యాపారం చేసుకునేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా తయారైందని అన్నారు. వీధి వ్యాపారుల కష్టాలను చూసి గొడుగులు పంపిణీ చేస్తున్నామని, వీధి వ్యాపారుల కోసం బిజెపి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తుక్కాని మన్మధ రెడ్డి, గజ్జల వెంకటరెడ్డి, చలమల్ల నరసింహ, సలిగంటి వీరేందర్, మీ అక్బర్, ఆర్రురి శివ, కొప్పుల క్రాంతి రెడ్డి, డాక్టర్ రవి, సంధ్యాల సైదులు తదితరులు పాల్గొన్నారు.