గృహలక్ష్మి పథకం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

గృహలక్ష్మి పథకం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

తుంగతుర్తి ముద్ర: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహలక్ష్మి పథకానికి దరఖాస్తుల స్వీకరణ తుంగతుర్తి తహసీల్ కార్యాలయంలో బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా డిప్యూటీ తాసిల్దార్    హరిచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల వారు తమ దరఖాస్తులను ఈనెల 12వ తేదీ వరకు తహసీల్ కార్యాలయంలో ఇవ్వవచ్చని అన్నారు. ఉదయం పదిన్నర నుండి సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని డిప్యూటీ తాసిల్దార్ తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు దరఖాస్తులను పూర్తి చేసి కార్యాలయానికి తీసుకురావాలని లబ్ధిదారులకు సూచించారు.