కాంగ్రెస్ పార్టీకి వెన్నుముక యూత్ కాంగ్రెస్ - మల్యాలలొ ఘనంగా 63 ఆవిర్భావ వేడుకలు

కాంగ్రెస్ పార్టీకి వెన్నుముక యూత్ కాంగ్రెస్ - మల్యాలలొ ఘనంగా 63 ఆవిర్భావ వేడుకలు

ముద్ర, మల్యాల: కాంగ్రెస్ పార్టీకి వెన్నుముక లాంటిది యువజన కాంగ్రెస్.. అని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నేరెళ్ల సతీష్ రెడ్డి అన్నారు. బుధవారం మల్యాల బ్లాక్ చౌరస్తా వద్ద యూత్ కాంగ్రెస్ 63 వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా సతీష్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి యూత్ కాంగ్రెస్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. రామన్నపేట మాజీ సర్పంచ్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలొ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలొ నాయకులు బత్తిని శ్రీనివాస్ గౌడ్, ముత్యం శంకర్, కృష్ణా రెడ్డి, కట్కo వినయ్, శ్రీకాంత్, ఎడిపల్లి రాజిరెడ్డి, ఎండీ ఇమామ్, తదితరులు పాల్గొన్నారు.