పామ్ హౌస్ ల నుంచి తండ్రి కొడుకులు(కేసిఆర్, కేటిఆర్) బయటికి రావాలి

పామ్ హౌస్ ల నుంచి తండ్రి కొడుకులు(కేసిఆర్, కేటిఆర్) బయటికి రావాలి
  • తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఇథనాల్ ప్యాక్టరిలకు అందించాలి 
  • భర్త భార్య ఆత్మ గౌరవం కాపాడుకోలేని పోలీసులకు రివాల్వర్, యునిపాం ఎందుకు
  • నిజామబాద్ ఎంపి అరవింద్ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: వరి రైతులు రోడ్లఫై ఉన్న  సిఎం కెసిఆర్ కు మనసు రాదు.. మనసుంటే మార్గమ ఉంటదని కేసిఆర్ మాట్లాడుతాడు.. కిటిఆర్ ఏమో టిట్టార్ల మీద పియం మోది, అమిత్ షా విమర్శించాదనికే సరిపోతాడని నిజామబాద్ ఎంపి అరవింద్ విమర్శించారు. జగిత్యాల మండలం లక్ష్మిపుర్ రైతు ఉత్పత్తి కంపని ప్రరంబోత్సవానికి వచ్చిన ఎంపి విలేకరులతో మాట్లడుతూ కేసిఆర్ మార్చి నెలలో అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు రూ. 10 వేల నష్ట పరిహారం ప్రకటించి మూడు నెలలు గడుస్తుంది ఇంకా ఇవ్వలేదు, పసల్ భీమ పెట్టలేదు.. రైతుల ధాన్యం తడిసి మొలకలు వచ్చి, రంగు మారి రైతులు అందోళనలో ఉన్నావారిని ఇంకా అదోలనకు గురి చేస్తూ తడిసిన ధాన్యంతో రైతులు 30 శాతం నష్టపొగ, సాధరణ ధాన్యానికి క్వింటాల్ కు 8 శాతం తరగు తీసి మూలిగే నాక్కఫై తాటి పండు పడ్డట్లు చేస్తున్నారని అన్నారు. తడిసన, మొలకలు వచ్చిన, రంగు మారిన ధాన్యాన్ని  ఇథనాల్ ప్యాక్టరిలు కొంగోనులు చేస్తాయని, రాష్ట్రంలో పెట్టమంటే తండ్రి కొడుకులు పెట్టలేదు ఎఫ్ సిఐతో మాట్లాడి పక్క రాష్ట్రాల ఇథనాల్ ప్యాక్టరిలకు పంపిచాలను సూచించారు.

రైతులు రంగు మరీనా ధాన్యాన్ని పదవేయాల్సిన పని లేదని తండ్రి,కొడుకులు పామ్ హౌస్ ల నుంచి బయటకు వచ్చి రైతుల ఫై దృష్తి పెట్టాలన్నారు. జగిత్యాల ఆర్టిసి బస్ లో జరిగిన సంఘటన ఫై స్పందిస్తూ భర్త భార్య ఆత్మ గౌరవం కాపాడుకోలేని రివాల్వర్ ఎందుకు, యునిపాం ఎందుకని ప్రశ్నించారు. ఎక్కడ కూడా ఎస్ ఐ భార్య సదర్ మహిళను ఏమయినా అన్నట్లు ఆధారం లేదని, ఎస్ఐ సివిల్ డ్రెస్ లో ఫోన్ తీసుకున్నాడు తప్ప ఏమి చేసింది లేదన్నారు. గిరిజన మహిళలను చీరలు పట్టి లాక్కొని పోయారు, మా బిజేపి నాయకులనుకూడా లక్కేలిన ఎ పోలీసులను ఏమి అనలేదు .. ఒక వర్గానికి చెందిన యువతి పిర్యాదు చేస్తే అగమేగల మీద సస్పెండ్ చేశారన్నారు. భార్య గౌరవం కాపాడలేని ఆ రివాల్వర్, యునిపాం ఎందుకో ఆ కేసిఆర్, కేటిఆర్ ను అడగండని అన్నారు.