రోడ్డుపై అరబోసిన వరీ ధాన్యన్ని పరిశీలించి రైతులతో మాట్లాడిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

రోడ్డుపై అరబోసిన వరీ ధాన్యన్ని పరిశీలించి రైతులతో మాట్లాడిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:  తిమ్మజిపేట్ మండలం  అవంచ - ఆర్ సీ తండా గ్రామాల మధ్యలో రోడ్డుపై అరబోసిన వరీ ధాన్యన్ని పరిశీలించి రైతులతో మాట్లాడిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వారితో మాట్లాడి పంట దిగుబడి,కొనుగోలు కేంద్రాల పనితీరు అడిగి తెలుసుకున్నారు, ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సొసైటీ అధికారులు సంచులు ఇవ్వడనికి చాలా సమయం తీసుకుంటున్నారు అని,నింపిన ధాన్యం బస్తాలు లోడ్ చేయడానికి సమయం తీసుకుంటున్నారు అని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో వెంటనే ఎమ్మెల్యే మర్రి ,DSO తో,సొసైటీ సీఈఓ నరేష్ తో మాట్లాడి వెంటనే రైతులందరికీ బస్తాలు అందజేయాలి అని ఆదేశించారు,నింపిన ధాన్యం బస్తాలను వెంటనే లోడ్ చేయాలి అని ఆదేశించారు,ఎవరైనా అధికారులు ఇబ్బంది పెడితే తనకు ఫోన్ చెయ్యాలి అని తన పర్సనల్ ఫోన్ నెంబర్ రైతులకు ఇచ్చారు, ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..