ముఖ్యమంత్రి బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు పూర్తి

ముఖ్యమంత్రి బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు పూర్తి
  •  గులాబీ ఫ్లెక్సీలతో నిండిన కందనూలు
  • ట్రాఫిక్ ఆంక్షలు అమలు భారీ జన సమీకరణకు యత్నం

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ : మరో ఆరు నెలల్లో సార్వత్రిక ఎన్నికలకు గడువు ఉండడంతో అధికార బిఆర్ఎస్ పార్టీ నేతలు మంత్రులు ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ మంత్రులను ఆహ్వానించి కార్యక్రమాలను ఇటీవల ముమ్మరం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ సాధించేందుకు పలు సంక్షేమ పథకాలను రూపొందిస్తూ జిల్లా కేంద్రాలలో బహిరంగ సభలు నిర్వహించేందుకు నేతలను ఆదేశించడంతో ఆయా జిల్లాలలో నూతనంగా నిర్మించిన కలెక్టర్ కార్యాలయాలు ఎస్పీ కార్యాలయాలు పార్టీ కార్యాలయాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసేందుకు సిద్ధం కావడంతో ఉమ్మడి జిల్లాలోని అన్ని జిల్లాలలో ఏర్పాట్లను పూర్తి చేశారు మరోవైపు ముఖ్యమంత్రి తనయుడు

మంత్రి కేటీఆర్ ఉమ్మడి పాలమూరు జిల్లా పై ప్రత్యేక దృష్టి సారించడంతో జిల్లా కేంద్రంలో కార్యాలయాలను ప్రారంభించేందుకు మంగళవారం స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనుండడం తో జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. జిల్లా కేంద్రంలోని వెలమ ఫంక్షన్ హాల్ పక్కన భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు స్థలం సేకరించి స్థానిక ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డితో పాటు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డిలు పలుదపాలలో ఏర్పాట్లను పరిశీలించి పూర్తి చేశారు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల నుండి లక్ష మంది ప్రజలను సమీకరించేందుకు ఏర్పాట్లను పూర్తి చేయడంతో జన సమీకరణ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారినట్లు తెలుస్తుంది. నియోజకవర్గాలలో ఒకవైపు దశాబ్ది ఉత్సవాల నిర్వహిస్తూ మరోవైపు కేసీఆర్ సభ పై దృష్టి సారించడం తెలిసింది మధ్యాహ్నం హెలికాప్టర్ ద్వారా జిల్లా కేంద్రానికి చేరుకొని కలెక్టర్ మరియు ఎస్పీ కార్యాలయంలో ప్రారంభించడంతోపాటు మెడికల్ కళాశాల పార్టీ కార్యాలయాలను ప్రారంభించి బహిరంగ సభలో పాల్గొంటారని ఎమ్మెల్యే తెలిపారు.

గులాబీమయమైన కందనూలు.......

ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన దృష్టిలో ఉంచుకొని జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిపై వందలాది ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో పాటు టిఆర్ఎస్ జండాలను ఏర్పాటు చేయడంతో కందనూల్ ప్రాంతం అంతా గులాబీమమైంది స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రత్యేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు నేతలను ఆదేశించడంతో కౌన్సిలర్లతోపాటు పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఫ్లెక్సీలను ముమ్మరంగా ఏర్పాటు చేశారు దీంతో ప్రజలకు కూడా ఇబ్బందులు కలిగేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలో ఏర్పాటుకు ముందస్తుగా అనుమతులు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ అధికార పార్టీ కావడం వల్ల ఎలాంటి అనుమతులు లేకుండానే వేలాది ఫ్లెక్సీలు వేయడంపై ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి.

ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి పై చర్చ

ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి పార్టీ మారనున్నారని ఇటీవల జోరుగా చర్చ సాగడంతో ముఖ్యమంత్రి హాజరయ్యే బహిరంగ సభలో కార్యక్రమాలలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి హాజరవుతారా లేదా అని ఈ ప్రాంతంలోని ప్రజలు చర్చించుకుంటున్నారు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి తో పాటు పలువురు ముఖ్య నేతలతో రహస్యంగా చర్చించినట్లు వాగానాలు వెలువడుతున్న తరుణంలో ముఖ్యమంత్రి సభకు హాజరవుతారా లేదా ఆయన వస్తే ముఖ్యమంత్రి ఆయనతో ఏ విధంగా ఉంటారో అని చర్చించుకుంటున్నారు.