బిఆర్ఎస్  కాంగ్రెస్ పార్టీలు రెండు ఒకటే

బిఆర్ఎస్  కాంగ్రెస్ పార్టీలు రెండు ఒకటే
  • బిజెపికి ఒక అవకాశం ఇవ్వండి
  • జగదీష్ రెడ్డి ని ఓడించడం బిజెపితోనే సాధ్యమవుతుంది

ముద్ర పెన్ పహాడ్: బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రెండు ఒకటే ఆని, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటేస్తే కాంగ్రెస్ మద్దతుతోనే కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని మాజీ ఎమ్మెల్యే బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం పెన్ పహాడ్  మండల కేంద్రంలో  గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు సంకినేని సమక్షంలో  బిజెపిలో చేరిన సందర్భంగా ఆయన  మాట్లాడుతూ సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గపోరు తో కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ నాయకులే ఓడిస్తున్నారని విసిగిపోయారని, మంత్రి జగదీశ్వర్ రెడ్డి కి వ్యతిరేకంగా అవినీతిపై పోరాటం చేస్తున్న బిజెపితో నే మంచి పరిపాలన సాధ్యమే నిర్ణయానికి ప్రజలు వచ్చారని అన్నారు. సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీని ఎవరు ఓడించాల్సిన పనిలేదని,వాళ్లని వాళ్లే ఓడించుకుంటారని ఎద్దేవా చేశారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తున్నారని  జగదీష్ రెడ్డి నీ ఓడించడానికి బీసీలు ఎస్సీలు సిద్ధంగా ఉన్నారన్నారు.

కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామపంచాయతీలలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వివరించారు. ఆపద కాలంలో ప్రతి ఒక్కరు ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వినియోగించుకోవాలని కోరారు. సూర్యాపేట పట్టణంలోని విజయలక్ష్మి హాస్పిటల్  లో ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఉచితంగా చికిత్సను అందిస్తున్నారన్నారు. సూర్యాపేట కాంగ్రెస్ లో ఉన్న సిండికేట్ స్టార్ , ప్యాకేజ్ స్టార్ లతో ప్రజలకు న్యాయం జరగదని,అవినీతిపై నిరంతరం పోరాటం చేస్తున్న భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సూర్యాపేటలో భారతీయ జనతా పార్టీ గెలిస్తే వ్యాపారస్తులకు రక్షణ తో పాటు పేదవారు కొనుక్కున్న ప్లాట్లకు రక్షణ, దోపిడీ దౌర్జన్యాలు జరగకుండా ప్రజలకు రక్షణగా ఉంటుందని హామీ ఇచ్చారు. పార్టీలో చేరిన వారిలో ఒగ్గు రాజు , ఒగ్గు వేణు, విజయ్, కమల సందీప్, మామిడి సాయికుమార్, మామిడి వేణు, వలపట్ల సంతోష్ , షేక్ పాష, మామిడి మధు, మామిడి మహేష్, ఒగ్గు రఘు, మేడి రాజు, మామిడి మధు తదితరులు ఉన్నారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పోకల రాములు, మండల నాయకులు తూముల సాయి, మండల ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి మధు, మండల ఉపాధ్యక్షులు రాపర్తి వెంకన్న, దళిత మోర్చా మండల అధ్యక్షుడు ఆరె ప్రభాకర్, మండల నాయకులు పిడమర్తి నాగయ్య, వెంకటేష్ , గూడెపూరి శ్రీను, ధూబాని లింగయ్య, నాగయ్య, బోల్లెద్దు సంతోష్, మల్లేష్, నాగరాజు, వినోద్, భాష పల్లయ్య( శ్రీను) ఒగ్గు రాములు, తదితరులు పాల్గొన్నారు.