లోక్ అధాలత్ ద్వారా కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు

లోక్ అధాలత్ ద్వారా కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు

 ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ 

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట :జూన్ 10వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అధాలత్ నిర్వహణపై జిల్లాలోని డిఎస్పి లు,సిఐ లు, ఎస్సై లు,కోర్టు డ్యూటీ పోలీసు అధికారులు, కోర్టు లైజన్ అధికారులతో  ఎస్పీ వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్   మాట్లాడుతూ రాజీకి, పరిష్కారానికి అవకాశం ఉన్న కేసులను ముందుగా గుర్తించాలని, గుర్తించిన కేసులను విభజించుకుని ప్రణాళిక ప్రకారం ముందుకెల్లాలని  ఎస్పీ తెలిపారు. పోలీస్ స్టేషన్లో  సిబ్బంది టీములుగా ఏర్పడి పని చేయాలన్నారు. కేసులలో ఇరు వర్గాల వారికి జాతీయ లోక్ అదాలత్ గురించి వివరించి ఆవశ్యకతను తెలియజేయాలని తద్వారా కేసుల రాజీకి, పరిష్కారానికి కృషి చేయాలని కోరినారు. ముందస్తుగా ప్రణాళిక చేసుకొని 15 రోజులు పాటు కృషి చేస్తే ఎక్కువ సంఖ్యలో కేసులని డిస్పోస్ చేయగలుగుతామని రాజీ, పరిష్కారం చేయవచ్చు అని అన్నారు. కోర్టు సిబ్బంది, న్యాయవాదులతో  పోలీసులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. బాగా పని చేసే సిబ్బందికి రివార్డ్స్ అందించడం జరుగుతుందన్నారు. రాజీమార్గమే రాజ మార్గమని ప్రజలు గుర్తించాలని వివాదాలకు పోకుండా అందరూ సామరస్యంగా ఉండాలని పోలీస్ శాఖ తరపున కోరుతున్నట్లు ఎస్పీ తెలిపారు.ఈ కార్యక్రమంలో  బిసిఆర్బి డిఎస్పీ రవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ నర్సింహ, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు..