ఎస్సీ వర్గీకరణ చేయకపోతే తెలంగాణ రాష్ట్రంలో BJP పార్టీ ని బొంద పెడతాం

ఎస్సీ వర్గీకరణ చేయకపోతే తెలంగాణ రాష్ట్రంలో BJP పార్టీ ని బొంద పెడతాం

ముద్ర, చివ్వెంల: ఎస్సీ వర్గీకరణ చేయకపోతే తెలంగాణ రాష్ట్రంలో BJP పార్టీ ని బొంద పెడతామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు యర్ర వీరస్వామి మాదిగ అన్నారు.శనివారం చివ్వేంల మండలకేంద్రం తహసిల్దార్ కార్యాలయం ముందు MRPS, ఆధ్వర్యంలో 6 వ రోజు రిలే నిరాహార దీక్ష లో నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ నెల 18 వ తేదీ నుంచి 22 వరకు జరిగే పార్లమెంట్ సమావేశాల్లోనే వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.    

ఎస్సీ వర్గీకరణ ద్వారానే మాదిగలకు ఉప కులాలకు భవిష్యత్తు ఉంటదని తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి నేటికీ 9 సం గడుస్తున్న మాట  నిలబెట్టుకోలేదని, కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ ప్రభుత్వం వర్గీకరణ చేస్తానని చెప్పిన హామీలను గుర్తు చేస్తూ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వంపై వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే తమ పార్టీ సభ్యులతో ఒత్తిడి తెచ్చి సామాజిక న్యాయమైన వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే విధంగా చొరవ తీసుకోవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమం లో 'మండల ఇంచార్జి -బొడ్డు విజయ్, మండల కన్వీనర్లు చెరుకుపల్లి సతీష్, మోలుగురి సునీల్, మండల నాయకులు కొంగల సతీష్,సిరపంగి లింగాస్వమి, మోలుగురి రాజు,బచ్చలి జ్యోతిబాబు, మొడ్డికత్తి లింగయ్య, బొల్లికొండ మహేష్, మోలుగురి వెంకన్న, నాగరాజు, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.