సూర్యాపేట కు అభివృద్ధి ఫలాలు అందించిన నాయకులు మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట కు అభివృద్ధి ఫలాలు అందించిన నాయకులు మంత్రి జగదీష్ రెడ్డి
  • లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆదుర్తి రమేష్ చంద్ర, ట్రెజరర్ రాచకొండ శ్రీనివాస్
  • దశాబ్దాల వెనకబాటును పారద్రోలి జిల్లా ను సస్యశ్యామలం చేశారు
  • తెలంగాణ ఉద్యమ సమయంలో కెసిఆర్ అడుగులో అడుగు వేసి తెలంగాణ వచ్చే వరకు కోట్లాడిన నాయకులు మంత్రి జగదీష్ రెడ్డి
  • తెలంగాణ వస్తుందా అని వెక్కిరించిన వారికి సమాధానమే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి
  • రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తల్లి గుంటకండ్ల సావిత్రమ్మ వర్దంతి సందర్భంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నందు రోగులకు అల్పాహారం పంపిణీ కార్యక్రమం

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: ఆర్దిక అసమానతలకు వ్యతిరేకంగా హక్కుల కోసం సాగిన సాయుధ పోరాటంతో చైతన్య వంతమైన తెలంగాణ లో  వచ్చిన స్వాతంత్ర్యం బూర్జువా నాయకుల మూలంగా  అభివృద్ధిని అందించక పోవడం మూలంగా ఐదు దశాబ్దాల పాటు వెనకబడిన సూర్యాపేట నియోజకవర్గం లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటిసారి అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందించిన నాయకుడిగా విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆదుర్తి రమేష్ చంద్ర, ట్రెజరర్ రాచకొండ శ్రీనివాస్  అన్నారు. విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తల్లి గుంటకండ్ల సావిత్రమ్మ వర్దంతి సందర్భంగా సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నందు మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో సూర్యాపేట లయన్స్ క్లబ్ వారిచే రోగులకు, వారి సహాయకులకు అల్పాహారం పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట జిల్లాలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి పేదలకు ఆధునిక వైద్యం అందుబాటులోకి తీసుకుని వచ్చారని అన్నారు.  ఒకప్పుడు సాగునీటి సౌకర్యం లేక కరువుతో ప్రజలు వలసలు పోయిన సూర్యాపేట జిల్లాకు కాళేశ్వరం జలాలు తీసుకుని వచ్చి జిల్లాను సస్యశ్యామలం చేసిన ఘనత మంత్రి జగదీష్ రెడ్డికే దక్కుతుందని అన్నారు.  తెలంగాణ ఉద్యమ సమయంలో కెసిఆర్ అడుగులో అడుగు వేసి తెలంగాణ వచ్చే వరకు మంత్రి జగదీష్ రెడ్డి కోట్లాడారని, తెలంగాణ వస్తుందా అని వెక్కిరించిన వారికి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సమాధానం చెబుతుందని అన్నారు.  మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశాల మేరకు గత 308 రోజుల నుండి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నందు దాతల సహకారంతో ప్రతిరోజూ ఉదయం అల్పాహారం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో  300 మంది  రోగులకు, వారి సహయకులకు అల్పాహారం పంపిణీ చేశారు.