ఉపాధి హామీ కూలీల కు పని భద్రత కల్పించాలి.. కడెం

ఉపాధి హామీ కూలీల కు పని భద్రత కల్పించాలి.. కడెం

ముద్ర .తిరుమలగిరి:  ఉపాధి హామీ కూలీలకు పని చేసే చోట పని భద్రత కల్పించాలని ఉపాధి హామీ కూలీలకు రోజు కూలి 600 రూపాయలు ఇవ్వాలని నిత్యవసర వస్తు ధరలు నిరంతరం పెరుగుతూ సామాన్యులపై భారం పడుతుంది ధరలకు అనుగుణంగా కూలీలకు కూలి పెంచాలని జి.ఎం.పి.ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య డిమాండ్ శుక్రవారo నాడు   తిరుమలగిరి మండలం తాటి పాముల గ్రానం లో ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పని నిర్వీర్యం చేయటం కోసం ప్రయత్నం చేస్తున్నారు గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పనిలో పని చేస్తున్న కూలీలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇంటి స్థలాలు ఇల్లు నిర్మించుకోవడం కోసం పది లక్షల రూపాయలు అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు ఉపాధి హామీ కూలీలకు వర్తించే విధంగా చూడాల న్నారు రాష్ట్ర ప్రభుత్వం  ప్రవేశపెట్టిన దళిత బందు లెక్క కూలి బందు కూడా ప్రవేశపెట్టి ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఎండలు తీవ్రత పెరుగుతున్నందున ఉపాధి హామీ కూలీలు పని చేసే చోట టెంటు మంచినీళ్లు మెడికల్ కిట్టు లాంటి వసతులు కల్పించాలి ఈ కార్యక్రమంలో బందెల అబ్రహం వెంకటయ్య పెరుమండ్ల సోమక్క గద్దల రజిత సరోజన జానయ్య గాజుల ఏసోబు తదితరులు పాల్గొన్నారు