కుదేలైన మామిడి రైతు

కుదేలైన మామిడి రైతు
  • దిగుబడి రాక దిగులు దళారుల దోపిడీ గుబులు
    ధర లేక దిగాలు
  • ప్రకృతి దెబ్బ ఒకవైపు దళారుల దెబ్బ ఇంకోవైపు
  • మామిడి రైతు కుడి ఎడమల దగా దగా
  • ఇతరులకు తీపిని పంచుతున్న మామిడి రైతు
    తాను మాత్రం బతుకంతా చేదుగా అప్పుల భారంతో మోస్తూ
  • ముద్ర ప్రతినిధి, సూర్యాపేట

మామిడి రైతులు ఈసారి దిగుబడి తగినంత రాక వచ్చిన దిగుబడికి మంచి రేటు పడక కుడి ఎడమల దోపిడీ గురై విలవిలాడుతున్నాడు ప్రకృతి కరుణ లేక దిగుబడి పడిపోవడం వచ్చిన కొద్ది దిగుబడి కూడా సరైన ధర రాక పోవడంతో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో మామిడి రైతులు కొట్టుమిట్టాడుతున్నారు సరిగా నీటి వసతి లేక మామిడి తోటలు నరికి వేయడంతో పాటు ఉన్న కొద్దిపాటి తోటలకు మేలో కురిసిన వర్షాలు అశనిపాతంలా మారాయి చెట్టు పైనే మామిడికాయలు తడవడం తెలిసినాక తెంచినాక వాటిలో పురుగు రావడంతో పాటు చీడపీడలకు గురై నాణ్యతలేని మామిడికాయ రావడం నాణ్యత లేదని సాకుతో వ్యాపారులు దళారులు సగానికంటే సగం ధరలు తగ్గించి మామిడి రైతులను వేధింపుల కోతలు కోశారు పర్యవేక్షించాల్సిన మార్కెటింగ్ శాఖల అధికారులు దళారి వ్యాపారులతో చేతులు కలిపి కిమ్మనక పోవడంతో దళారులు పాడిందే పాటగా చెప్పిందే రేటుగా చెల్లుబాటై మామిడి రైతులని కుంగతీసాయి దీనికి తోడు తన్నుకు కింటాకుకు పైగా తరుగు తీయడం తూకంలో మోసాలు చేయడంతో రైతులు మరింత దీన హీనస్థితికి చేరుకున్నారు నిత్యం పర్యవేక్షించాల్సిన తూనికల కొలతల శాఖల అధికారులు కూడా తూతూ మంత్రంగా వ్యవహరించడంతో రైతులు నష్టాలపాలై ఆర్థికలేమిటో కొట్టుమిట్టాడుతున్నారు మొత్తంగా మామిడి వ్యాపారులు మార్కెటింగ్ శాఖ అధికారులు తూనికల కొలతల శాఖల అధికారులు తిలాపాపం తలా కొంచెం వ్యవహరించి మామిడి రైతులను నిలువునా ముంచేశారు.

ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఎక్కడ గాని ఏ కార్పొరేట్ అయిన తమ తమ ఉత్పత్తులకు తామే ధర నిర్ణయించి అతను నిర్ణయించిన ధరకే మనం కొనేలా అద్దాల మేడలో ఏసీ గదుల్లో తమ తమ ఉత్పత్తుల నుంచి తళుకు బెలుకులు అద్దె వినియోగదారులను దోచుకునే సంస్కృతి ఒకవైపు కానవస్తుండగా మరోవైపు ఈ ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాతలు మాత్రం తమ తమ ఉత్పత్తులను రోడ్డు పక్కన దిక్కులేని స్థితిలో ఉంచి అయ్యా వ్యాపారులారా మా ఉత్పత్తులను కొనండి సంపద మాది రేటు మాత్రం మీది మీ ఇష్టం వచ్చిన రేటు కొనండి అని బతిమాలు కోవడం ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న ఎనిమిదో వింత నగ్నసత్యంగా మన కళ్ళ ముందర సాక్షాత్కరిస్తుంది. మామిడి రైతులు నిట్ట నిలువునా దోపిడి గురై అల్లల్లాడుతున్న వైనంపై ముద్ర ప్రత్యేక కథనం

దిగుబడి తగ్గింది మామిడి రేటు తగ్గింది

సూర్యాపేట జిల్లాలో ఈసారి 10,720 ఎకరాల్లో మామిడి సాగు చేశారు అయితే ఇది ప్రతి సంవత్సరం మామిడి సాగు చేసే ఎకరాల కంటే చాలా తక్కువ సాగు ఈసారి చేశారు కారణం నీటి వసతి సరిగా లేకపోవడం చీడపీడలు మామిడికి బాగా రావడంతో మామిడి సాగుపై రైతులు వెనకంజ వేశారు ఈసారి జిల్లాలోని మామిడి పంట దిగుబడి 1.05 లక్షల మెట్రిక్ టన్నులు రావాల్సి ఉండగా కేవలం 35 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది. దీనికి కారణం మామిడి పూత పిందె దశ నుంచి చీడపీడలు బాగా పట్టడం ఒక కారణం కాదా వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకోవడం మరొక కారణం అయింది దీంతో పెట్టిన పెట్టుబడులు రాక మామిడి రైతులు తలలు పట్టుకున్నారు దీనికి తోడు ఈసారి ధర కూడా వ్యాపారులు సిండికేట్ అయి తగ్గించడంతో దిక్కుతోచని స్థితిలో మామిడి రైతులు హా హాకారాలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది గత సంవత్సరం క్వింటా మామిడికాయలు మూడు నుంచి నాలుగు వేల రూపాయల ధర పలకగా ఈసారి 1200 నుంచి 28 వందల రూపాయల వరకు మాత్రమే ధర పలకటం  నిస్టురపడ్డ నిజం మాత్రం ఇదే. మరోపక్క మామిడికాయలపై మంగు మచ్చలు ఉన్నాయని క్వింటాకు 500 నుంచి 800 రూపాయల వరకు మాత్రమే ధర పెట్టారంటే వ్యాపారుల దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు

నష్టాలు రావడంతో మామిడి తోటలు నరికి వేస్తున్న రైతులు

గతం కొంచెం వర్తమానం కంటే మెరుగైనప్పటికీ నానాటికి మామిడి రైతుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది ఈసారి జిల్లాలోని సూర్యాపేట తుంగతుర్తి కోదాడు హుజూర్నగర్ నియోజకవర్గంలో అనుకున్నంత స్థాయిలో దిగుబడి రాలేదు సూర్యాపేట నియోజకవర్గ పెన్ పహాడ్  మండలం లింగాల గ్రామంలో 30 ఎకరాలు చీదెళ్ళగ్రామంలో 10 ఎకరాలు కోదాడ నియోజకవర్గంలోని గుడిబండ గ్రామంలో 30 ఎకరాలు మునగాలలో 30 ఎకరాలు తుంగతుర్తి నియోజకవర్గంలోని నూతనకల్ మండలం ఎర్ర పహాడ్ గ్రామంలో 20 ఎకరాలు మొత్తంగా 120 ఎకరాల మామిడి తోటలను రైతులు నరికివేసి ఇతర వ్యవసాయం చేస్తున్నారు అకాల వర్షాలకు మరొక 1400 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది దీంతో మొత్తంగా దిగుబడి 40 శాతం మేర తగ్గింది సూర్యాపేటలో అమ్మడానికి  ఆంధ్ర ప్రదేశ్ నుండి తెలంగాణలోని ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు మహబూబ్నగర్ జనగామ మహబూబాద్ ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి కూడా మామిడికాయ అమ్మకానికి వస్తుంది వాస్తవానికి దిగుబడి తగ్గితే రేటు పెరగాల్సింది పోయి రేటు కూడా పడిపోవడంతో దిక్కు తోచని స్థితిలో మామిడి రైతులు ఉన్నారు

నిద్రపోతున్న మార్కెటింగ్ తూనికల శాఖల అధికారులు
రైతులను దోచుకుంటున్న వ్యాపారులకు వత్తాసు

వాస్తవానికి రైతులు ఎవరైనా తమ పంటలను అమ్మాలి అన్న కొనాలన్నా మార్కెటింగ్ శాఖ పర్యవేక్షణలో జరగాలి కానీ సూర్యాపేటలో మాత్రం మామిడికాయల మార్కెట్ ప్రైవేట్ గా వేరేచోట బహిరంగ స్థలాల్లో రేకుల షెడ్లు వేసి వ్యాపారులు ఏర్పాటు చేశారు అక్కడికి తమ ఉత్పత్తులను తెచ్చిన రైతులను వ్యాపారులు కుమ్మక్కై సిండికేట్ గా మారి ఒక్కసారిగా రేటు తగ్గించేస్తున్నారు. సూర్యాపేటలో ఇంత పెద్ద మార్కెట్ ఉన్నప్పటికీ ఉపయోగించుకోకుండా బయట రోడ్డు పక్కన ఏదో ఒక దళారి వద్ద తమ సరుకును రైతులు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది పర్యవేక్షించాల్సిన మార్కెటింగ్ శాఖ అధికారులు తూతూ మంత్రంగా నామమాత్రపు తనిఖీలు జరిపి తమ చేతులు తడవగానే వెళ్ళిపోతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు ప్రమాదకరమైన కార్బన్ ను కృత్రిమ పద్ధతుల్లో కాయలు పండటానికి ఉపయోగిస్తున్నప్పటికీ ఫుడ్ ఇన్స్పెక్టర్ శాఖల అధికారులు తమ తమ వాటాలు పంచుకొని వెళ్తున్నారని రైతులు చెప్పడం గమనాహరం . తరుగు పేరుతో టన్నుకు క్వింటా కాయలు తీయడం వ్యాపారుల తూకపు యంత్రాలు కూడా లోపాలతో ఉండటం ఎక్కువ కాయలు వేసినప్పటికీ రైతులను కోలుకోలేని దెబ్బతీస్తుంది ఇందుకు నిత్యం పరవేశించాల్సిన తూనికలు కొలతల శాఖల అధికారులు కూడా ప్రతి వ్యాపారి నుంచి తమకు అందుతున్న ముడుపులను ముల్లె వేసుకొని ప్రత్యక్షంగా వెళుతున్న వారిని రైతులు చూస్తూ ఉండటం ఇక్కడ నిత్యం జరిగే పని. ఇలా అన్నదాతకు అండగా నిలవాల్సిన మూడు శాఖల అధికారులు కూడా ముడుపుల మోజులో పడి నిద్ర నటిస్తుండడంతో వ్యాపారుల ఇష్టారాజ్యానికి అడ్డు అదుపు లేకుండా పోతుందని ఆరోపణలు  వెల్లువెత్తుతున్నాయి

అన్నదాత నిలువు దోపిడీకి అడ్డుకట్ట వేసే వారే లేరా...!

ప్రకృతి దెబ్బ ఒకవైపు దళారి వ్యాపారుల దెబ్బ మరోవైపు అధికారుల ఉదాసీనత ఇంకోవైపు ఇన్ని రకాలుగా దెబ్బ మీద దెబ్బ పడుతుంటే ఏ అన్నదాత మాత్రం తట్టుకోగలడు తట్టుకొని వ్యవసాయం చేయగలరు మామిడి నాశించే చీడపీడలపై పోరు చేయాలి ప్రకృతి వైపరీత్యా లపై పోరు చేయాలి మంచి రేటు కోసం వ్యాపారులతో తలపడాలి తమకు అండగా నిలవాలని సంబంధిత అధికారులను వేడుకోవాలి ఇన్ని రకాలుగా కష్టాల  సుడిగుండంలో నలిగిపోతు చిత్తవుతున్న మామిడి రైతును ఆదుకునే వారే లేరా అని వాపోడం ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలవంతయింది. ఈ దుష్ట దుర్మార్గపు వ్యాపారుల దళారి దోపిడీకి  చరమగీతం పాడాలని అహర్నిశలు కష్టపడి సమాజానికి ఇంత బువ్వ పెడుతున్న అన్నదాతను ఆదుకోవాలని మనసారా కోరుకుందాం