టీడీపీ, జనసేన పొత్తు ఖాయం: పవన్​ కళ్యాణ్​

టీడీపీ, జనసేన పొత్తు ఖాయం: పవన్​ కళ్యాణ్​

టీడీపీ, జనసేన పొత్తు ఖాయమని జనసేన అధినేత పవన్​ కళ్యాణ్​ అన్నారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత సీఎం అభ్యర్ధి ఎవరన్నది ఆలోచిద్దామన్నారు. వైసీపీ సర్కారు అవినీతి, అక్రమాలపై పోరాటం కొనసాగుతుందని అన్నారు. నా రాష్ట్రం, ప్రజల కోసం గట్టిగా నిలబడుతున్నానని చెప్పారు. మళ్ళీ జగన్ కు ఓటేస్తే రాష్ట్రం జీవితంలో కోలుకోదని అన్నారు. వైసీపీ సర్కారును కచ్చితంగా గద్దె దింపాల్సిందేనన్నారు. అన్ని పద్ధతులు బాగుంటే టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయన్నారు. త్రిముఖ పోరులో బలి కావడానికి జనసేన సిద్ధంగా లేదని చెప్పారు. జనసేన పోటీ చేసిన స్థానాల్లో పెద్ద మెజారిటీతో గెలుస్తామన్నారు. అప్పుడు సీఎం గురించి మాట్లాడే హక్కు ఉంటుందని అన్నారు.

పార్టీ నిర్మాణం అనేది చాలా కష్టసాధ్యమైన విషయం 
సమాజంలో అందరూ బాగుండాలని జనసేన అధినేత పవన్​ కళ్యాణ్​ అన్నారు. ఆయన మంగళగిరిలో మాట్లాడుతూ  సీనియర్​ ఎన్​టీఆర్​ పార్టీ పెట్టినప్పుడు ఇన్ని పార్టీలు లేవన్నారు. ఆయనకు అధికారం త్వరగా వచ్చింది. పార్టీ నిర్మాణం అనేది చాలా కష్టసాధ్యమైన విషయం. వందల వేల కోట్లు లేకపోయినా సంకల్పబలంతో పార్టీని నడుపుతున్నాం. జీరో బడ్జెట్​ పాలిటిక్స్​ అని నేనెప్పడూ అనలేదు. నేను ఒక కులానికి నాయకుడిని కాను అన్నారు. నాకు అంత త్వరగా అధికారం వస్తుందని అనుకోవడంలేదు. గజమాలలు వేస్తే నేను సీఎం కాలేను. హారతులు ఇస్తే నేను సీఎం కాలేను. ఓట్లు వేస్తే సీఎంని అవుతానన్నారు.