డాక్టర్ల కోసం ప్రజలు వెళ్ళాల్సిన అవసరం లేదు

డాక్టర్ల కోసం ప్రజలు వెళ్ళాల్సిన అవసరం లేదు

డాక్టర్ల కోసం ప్రజలు వెళ్ళాల్సిన అవసరం లేదన్నారు ఏపీ సీఎం వైఎస్​ జగన్​.  డాక్టర్లే మీ ఇంటి దగ్గరకు వస్తారన్నారు.  మంచానికి పరిమితమైన రోగుల వద్దకు వైద్య సేవలు వస్తాయన్నారు. మందులు కూడా ఉచితంగా అందించే ఫ్యామిలీ డాక్టర్స్​ కాన్సెప్ట్​  ప్రవేశపెట్టామన్నారు.

పల్నాడు జిల్లా లింగంగంట్లలో ఇంటింటా వైద్యం, ఫ్యామిలీ డాక్టర్​ కార్యక్రమం ప్రారంభం. ఫ్యామిలీ డాక్టర్​ వైద్యవిధానం ద్వారా గ్రామాలలో ప్రజలకు మరింత మెరుగైన సేవలు. డాక్టర్​ కోసం తిరగాల్సిన అవసరం లేదన్న  సీఎం జగన్​. ఇంటి వద్దకే వైద్యులు వస్తారన్నారు.  క్యాన్సర్​, గుండె జబ్బులు, టీబీ వ్యాధులను తొలి దశలోనే గుర్తించవచ్చాన్నారు.  వైఎస్‌ఆర్​ విలేజ్​ క్లినిక్​లలో 105 రకాల మందులు అందుబాటులో ఉన్నాయన్నారు.  ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వం తమదని చెప్పారు.  ప్రతి మండలానికి నలుగురు డాక్టర్లు అందుబాటులో ఉంటారన్నారు.