రాష్ట్ర, జిల్లా, మండల, ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

రాష్ట్ర, జిల్లా, మండల, ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం
  • సమాజంలో ఉపాధ్యాయుని పాత్ర విశిష్టమైనది.
  • ఎంపీపీ గుండ గాని కవిత రాములు గౌడ్.

తుంగతుర్తి ముద్ర: సమాజంలో ఉపాధ్యాయుని పాత్ర విశిష్టమైనదని తుంగతుర్తి మండల పరిషత్ అధ్యక్షురాలు గుండ గాని కవిత రాములు గౌడ్ అన్నారు .తుంగతుర్తి మండల పరిధిలోని వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులలో మండల ,జిల్లా ,రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక అయిన వారిని ఘనంగా సన్మానించిన సందర్భంగా ఎంపీపీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠశాల స్థాయి నుండి క్రమశిక్షణ కలిగిన విద్యను నేర్పించినట్లయితే వారు సమాజంలో మంచి పౌరులుగా మన గలుగుతారని అన్నారు .మంచి సమాజం ఏర్పడాలంటే ఉత్తమ గుణాలున్న పౌరులు ఎదగాలని, అలాంటి పౌరులు ఎదగడానికి పాఠశాలలో ఉపాధ్యాయులు నేర్పే ఉత్తమ విద్య తోడ్పడుతుందని అన్నారు .ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తూ తమకు వచ్చిన విద్యను విద్యార్థులకు చక్కగా బోధించి ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తింపబడడం గర్వకారణం అని అన్నారు .ఉపాధ్యాయులు అందరూ ఉత్తమ ఉపాధ్యాయులే అని అన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన13 మంది మండల స్థాయి ఉపాధ్యాయులు ,అలాగే ఐదుగురు జిల్లా స్థాయి ఉపాధ్యాయులు, రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన శ్రీమతి వెంకటరామ నరసమ్మ ను శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ బోయిని లింగయ్య, ఎంపీడీవో భీమ్ సింగ్  డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు ,కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు యాకయ్య , కే రవీందర్  ,గురువయ్య, పి ఆర్ టి యు మండల అధ్యక్షులు ఎర్ర హరికృష్ణ, యుటిఎఫ్ ప్రధాన కార్యదర్శి రవీందర్ ,డిటిఎఫ్ జిల్లా కౌన్సిలర్ మిర్యాల మధు, టి పి టి ఎఫ్ బాధ్యులు సిహెచ్ కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు

తుంగతుర్తి మండల కేంద్రంలోని స్త్రీ శక్తి భవనంలో జరిగిన మండల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రధాన కార్యక్రమంలో సభాధ్యక్షులుగా శ్రీ బోయిన లింగయ్య గారు ముఖ్యఅతిథిగా శ్రీమతి గుండ గాని కవితా రాములు గౌడ్ గారు విశిష్ట అతిథిగా డిసిసిబి డైరెక్టర్ శ్రీ గుడిపాటి సైదులు గారు ఎంపీడీవో భీమ్ సింగ్ గారు మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య గారు శ్రీ గుండగాని రాములు గారు కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు యాకయ్య గారు కే రవీందర్ గారు ఎఫ్ ఎల్ ఎన్ ఇంచార్జ్ శ్రీ మా గీ గురువయ్య గారు పిఆర్టియు మండల అధ్యక్షులు శ్రీ ఎర్ర హరికృష్ణ గారు యుటిఎఫ్ ప్రధాన కార్యదర్శి శ్రీ రవీందర్ గారు డిటి ఎఫ్ జిల్లా కౌన్సిలర్ శ్రీ మిర్యాల మధుగారు టి పి టి ఎఫ్ బాధ్యులు శ్రీ సిహెచ్ కరుణాకర్ గారు పాల్గొన్నారు మండల పరిధిలో 13 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా సన్మానించగా జిల్లా పరిధిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన ఐదుగురిని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు పొందిన శ్రీమతి వెంకట రామ నర్సమ్మ గారిని సన్మానించారు ఎంపీపీ గారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల పాత్ర చాలా గొప్పది అని తెలిపారు సైదులు గారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమాజానికి మార్గదర్శకత్వం తెలిపారు సీతయ్య గారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు గొప్ప గా పని చేయాలని తెలిపారు  రాములు గారు మాట్లాడుతూ నాయకత్వ లక్షణాలు ఉన్న వాడు మాత్రమే ఉపాధ్యాయ అవుతాడు అని చెప్పారు భీం సింగర్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల కృషి ఎనలేనిది అని చెప్పారు.