బిఆర్ఎస్ పార్టీ ప్రజాధనం దుర్వినియోగం చేస్తుంది.. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి

బిఆర్ఎస్ పార్టీ ప్రజాధనం దుర్వినియోగం చేస్తుంది.. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి

ముద్ర, చివ్వెంల : బిఆర్ఎస్ పార్టీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. ఈనెల 27న ఖమ్మంలో బహిరంగ  సభ ఉన్నందున ఏర్పాట్లను చూసేందుకు  కేంద్రమంత్రి,    బిజెపి రాష్ట్ర అధ్యక్షులు   కిషన్ రెడ్డి శుక్రవారం రోడ్డు మార్గాన హైదరాబాద్ నుంచి ఖమ్మం  వెళ్తు మార్గమధ్యలో చివ్వెంల మండల ఐలపురం స్టేజ్ వద్ద బీజేపీ నాయకులు సంకినేని వరుణ్ రావు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.  అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్,బిఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటేనని తెలిపారు. హైదరాబాద్ రింగ్ రోడ్ లను ఓ ప్రైవేట్ సంస్థకి  దానాధతం చేసి,భూములను పెద్ద ఎత్తున వేలం వేయడం, నాలుగు నెలల ముందే లిక్కర్ షాప్ కు టెండర్లు వేయడం, అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం పాలు చేసిందన్నారు. అధికారం కోసం ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెడతారు, ఈ రాష్ట్రాన్ని మద్యానికి అంకితం చేస్తారు, ఈ రాష్ట్రాన్ని అవినీతికే అంకితం చేస్తారు, తెలంగాణలో కెసిఆర్ పాలన పోవాలంటే, తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం పరిపాలన పోవాలంటే, ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీని ఆదరించాలని కోరారు. నరేంద్ర మోడీ కి ప్రజలందరూ అండగా ఉండాలని చెప్పారు.

ఈ కార్యక్రమంలో సూర్యాపేట బిజెపి జిల్లా అధ్యక్షుడు భాగ్యరెడ్డి, బిజెపి రాష్ట్రఅధికార ప్రతినిధి సంకినేని వరుణ్, చివ్వెంల మండల అధ్యక్షులు లక్ష్మణరావు, మైనార్టీ నాయకులు యంఏ వాజిద్ మియా, మండల ప్రధాన కార్యదర్శి జంపాల వెంకటేశ్వర్లు, బిట్టు నాగరాజు, ధరావత్ రవి, తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.