ఉద్యోగ భద్రత రిటైర్మెంట్ వసతులు కల్పించాలి ఎమ్మెల్యే గండ్రకి వినతి పత్రం అందించిన అంగన్వాడీ టీచర్స్

ఉద్యోగ భద్రత రిటైర్మెంట్ వసతులు కల్పించాలి  ఎమ్మెల్యే గండ్రకి వినతి పత్రం అందించిన అంగన్వాడీ టీచర్స్

ముద్ర న్యూస్ రేగొండ: తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు ఇతర ఉద్యోగులతో పాటు అంగన్వాడీ కార్యకర్తలకు గౌరవ పిలుపును అందించి పి ఆర్ సి వర్తింప చేసినందుకు సీఎం కేసీఆర్ కు అంగన్వాడీ టీచర్ల ద్వారా కృతజ్ఞత తెలుపుతున్నామని.అలాగే అంగవాడి టీచర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని. రిటైర్మెంట్ సదుపాయాలు కల్పించాలని కోరుతూ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ రెడ్డి కి వినతిపత్రాన్ని సమర్పించిన రేగొండ మండల అంగన్వాడీ టీచర్లు.ప్రధానంగా ఐసీడీసీ స్థాపించిన నాటినుండి ఉద్యోగ భద్రత లేక రిటైర్మెంట్ సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నామని.

గత 48 సంవత్సర కాలం నుండి ఉద్యోగ చేస్తూ అనారోగ్యానికి గురవుతున్నామని.అనారోగ్య సమస్యలతో మరణిస్తున్నా టీచర్లకు ఎలాంటి ఆర్థిక సహాయం అందడం లేదని ఐన కుటుంబ పోషణ కోసం ఉద్యోగం చేస్తున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా. ఉద్యోగ భద్రత కల్పించాలని. ఉద్యోగ విరమణ అనంతరం ఫెన్షన్ అందించాలని కోరారు. ఉద్యోగ విరమణ పొందిన టీచర్లకు ఐదు లక్షలు ఆయాలకు మూడు లక్షలు. అందించాలని అలాగే టీచర్లకు ఐదు వేల రూపాయల ఫెన్షన్ ఆయాలకు మూడు వేల ఫెన్షన్ ఇవ్వాలని ఎవరైనా అంగన్ వాడి టీచర్లు ఆయాలు మరణిస్తే ముప్పై వేళా మట్టి ఖర్చులు అందించాలని .వినతిపత్రం లో పొందుపరచి ఎమ్మెల్యే కు అందించారు.ఈ కార్యక్రమంలో రజిత, ఇంద్ర,కల్పన,లలిత,రజిత,సునీత, రమ,తదితరులు ఉన్నారు..