మాజీ సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శ

మాజీ సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శ
  • జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్  కేకే మహేందర్ రెడ్డి

ముద్ర, ఎల్లారెడ్డిపేట :రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రాగట్లపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మందాటి రాజు  నాలుగు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా శనివారం మధ్యాహ్నం వారి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా రాజు భార్య రమ్య,కుమారులను, సోదరులతో పాటు తండ్రి లచ్చయ్యను పరామర్శించారు. అదేవిధంగా హరిదాస్ నగర్ గ్రామంలో వడ్లను అమ్మిన డబ్బులు ప్రభుత్వం సకాలంలో అందించలేదని ఆత్మహత్య చేసుకున్న గోపన్నగారి లక్ష్మయ్య భార్య  బాలవ్వను, కుమారులను పరామర్శించారు. ఆయన వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, నాయకులు దాసరి మహేందర్,రాంరెడ్డి, బుచ్చా గౌడ్ ,గంగయ్య, ప్రశాంత్ ఉన్నారు.