బీఆర్ఎస్ నేతలు నోరు జారుతున్నరు..

బీఆర్ఎస్ నేతలు నోరు జారుతున్నరు..
  • రాజన్నసిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ లో ముసలం
  • జిల్లా బీఆర్ఎస్ మొత్తం ఆఘమాగం..క్యాడర్ లో వర్గ విబేధాలు
  • రాజకీయ సమస్యలతో బీఆర్ఎస్ జిల్లా నాయకత్వం సతమతం
  • విదేశి పర్యటనలతో మంత్రి కేటీఆర్.. రాజకీయ సమస్యలన్ని పెండింగ్
  • బీఆర్ఎస్ పార్టీలో పెరుగుతున్న అంతరాలు.. నాయకుల మధ్య పంచాయతీలు
  • వివాదాల్లో చిక్కుకుంటున్న బీఆర్ఎస్ ముఖ్య నేతలు..
  • బీఆర్ఎస్ అధిష్టానానికి తలనొప్పులు తెస్తున్న నాయకులు..
  • మంత్రి కేటీఆర్ వస్తేనే రాజకీయ పంచాయతీలు సర్ధుమనిగేవి

ముద్ర ప్రతినిధి, రాజన్నసిరిసిల్ల:

రాజన్నసిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీలో వర్గవిబేధాలు.. గ్రూపు రాజకీయాలు.. రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. జిల్లా బీఆర్ఎస్ క్యాడర్లో నెలకొన్ని సమస్యలు పరిష్కరించడంతో జిల్లా నాయకత్వం అలసత్వంగా వ్యవహరించడంతో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల్లో, కార్యకర్తల్లో ఆఘాదం ఏర్పడుతుంది. రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఎక్కడి రాజకీయ పంచాయతీలు అక్కడే పెరుకుపోయాయి. మంత్రి కేటీఆర్ విదేశి పర్యటనలో ఉండటంతో రాజన్నసిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ క్యాడర్ లో సమస్యలు పట్టించుకునే వారు లేక మరింత జఠిలమయ్యాయి. బీఆర్ఎస్ ముఖ్య నేతలు నోరు జారుతుండటంతో ప్రజల్లో.. సామాజిక వర్గాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఏర్పడుతుంది.


నోరు జారుతున్న నేతలు.. మంత్రి కేటీఆర్కు తలనొప్పులు

రాజన్నసిరిసిల్ల జిల్లాలో సెస్ చైర్మన్ చిక్కల రామారావు సిరిసిల్ల పద్మశాలీ నేతలపైన అనుచిత వాఖ్యలు చేస్తూ.. మీ ఇష్టం ఉంటే ఓటు వేయండి లేకపోతే లేదు.. మీరు ఓటేస్తేనే మేం గెలుస్తున్నమా అని మాట జారి.. తర్వాత నేను అనలేదు అంటూ తప్పించుకున్నారు. అనంతరం సెస్ ఉద్యోగుల బదిలీలు, దళిత, గిరిజన కాలనీలకు విద్యుత్ బకాయిలు చెల్లించడం లేదన్న నెపంతో విద్యుత్ సరఫరా నిలిపివేయడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడంపై వార్తాలు రావడంతో ఈ వార్తాలు బీఆర్ఎస్ నేతనే రాయిస్తున్నడంటూ.. ఓ డైరక్టర్ భర్తతో అనుచిత వాఖ్యలు చేయడంతో ఈ పంచాయతీ కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో.. ఒకరిని ఒకరు దూషించుకునే స్థాయికి పోయింది. జిల్లా ముఖ్యులు మొత్తం చిక్కాల రామారావు,  కేటీఆర్ మేనభావ చీటీ నర్సింగరావు మధ్య నెలకొన్ని వివాదాన్ని సద్దుమనిగించేందుకు చర్చలు ప్రారంభమయ్యాయి.  సిరిసిల్ల పద్మశాలీయులు ఎంతో పవిత్రంగా నిర్వహించే నూలు పౌర్ణమీ వేడుకల్లో బీఆర్ఎస్ పట్టణధ్యక్షులు జిందం చక్రపాణి తమకు గౌరవడం ఇవ్వడం లేదనే నెపంతో బూతు పదజాలం అందకోవడంతో సిరిసిల్ల లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపిగా పంచాయతీ మారింది. ఆధ్యాత్మీక కార్యక్రమంలో అనుచిత వాఖ్యలు చేసి బీఆర్ఎస్ నేతలు విమర్శల పాలయ్యారు. పద్మశాలీ సంఘం నేతల మధ్య, బీఆర్ఎస్ నేతల మధ్య నెలకొన్ని ఈ వివాదాన్ని రూపుమాపేందుకు ప్రయత్నాలు జిల్లా నాయకులు ప్రారంబించారు. అర్బన్ బ్యాంకు చైర్మన్ గాజుల నారయణపై సోంత పార్టీ డైరక్టర్లే అవిశ్వాసం పెట్టడం కూడా బీఆర్ఎస్ పార్టీలో లుకలుకలకు కేరాఫ్గా మారింది. వర్గ విబేధాలు బహర్గతమయ్యాయి. మంత్రి కేటీఆర్ ప్రతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల లో ఏ అవిశ్వాసమైన.. మేజర్ నిర్ణయాలు బదిలీలు.. విద్యుత్ కనెక్షన్ల తొలగింపు వంటికి ఆయన నోటీసులో పెట్టి చేయాలి కానీ కేటీఆర్కు సమాచారం లేకుండానే కొనసాగుతున్నయంటే.. అసలు రాజన్నసిరిసిల్ల జిల్లా లో ఏం నడుస్తుంది అని పలువరు ముఖ్యులు చర్చించుకుంటున్నారు.

తంగళ్లపల్లి బీఆర్ఎస్ లో పంచాయతీ..

తంగళ్లపల్లి బీఆర్ఎస్ పార్టీలో వర్గ విబేధాలు చోటు చేసుకున్నాయి. ఎంపిపి పడిగెల మానసకు, జడ్పీటీసీ పూర్మాణి మంజులకు మద్య ఓ బీఆర్ఎస్ సీనియర్ నేత, ఓ సంస్థ చైర్మన్ వాఖ్యలతో పంచాయతీ నెలకొంది. వచ్చేసారి జడ్పీటీసీ మండెపల్లి సర్పంచ్ గనప జ్యోతిని చేద్దాం అనుకున్న.. కాని ఇప్పుడు మంజులను తప్పించి.. ఎంపిపి పడిగెల మానసను జడ్పీటీసీగా చేసి జడ్పీచైర్మన్గా చేస్తాను అని వాఖ్యానించడంతో ఒక్కసారిగా తంగళ్లపల్లి బీఆర్ఎస్ రాజకీయ వేడెక్కింది. జడ్పీటీసీ మంజుల భర్త లింగారెడ్డి తన మద్దతుదారులతో సమావేశం ఏర్పాటు చేసి చైర్మన్ తీరును నిరసించారు. మంత్రి కేటీఆర్ను కాదని జడ్పీ చైర్మన్ పదవి ఇచ్చేందుకు ఈ చైర్మన్కు ఏం హక్కు ఉంది అంటూ విమర్శించారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లెందుకు తంగళ్లపల్లి బీఆర్ఎస్ నేతలు సిద్దం అవుతున్నారు. తంగళ్లపల్లి మండల బీఆర్ఎస్ ఈ సంస్థ చైర్మన్ చేయబట్టే ఆఘాధం ఏర్పడిందని, గ్రూపు రాజకీయాలు పెంచి పోశిస్తున్నరని లింగారెడ్డి పేర్కొన్నారు. 

ముస్తాబాద్ లో..
ఏఏంసీ చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్ ఇవ్వడంతో ముస్తాబాద్ పట్టణ నాయకులు సమావేశం ఏర్పాటు చేసి ముస్తాబాద్ పట్టణ వాసులకు  పదవి కేటాయించాలని గొడవకు దిగారు. పోటా పోటీ సమావేశాలు ఏర్పాటు చేసుకోని రెండు గ్రూపులుగా వీడిపోయారు. సమస్య ఇలానే ఉంది.. ముస్తాబాద్ లో రెండు గ్రూపులుగా బీఆర్ఎస్ నేతలు వీడిపోయారు. మంత్రి కేటీఆర్ వచ్చేదాక ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ఓపిక పడుతున్నారు. జిల్లా నాయకత్వం మూలంగానే ఈ సమస్య వచ్చిందని పేర్కొంటున్నారు.

ఎల్లారెడ్డిపేటలో..

ఎల్లారెడ్డిపేట మండలంలో బీఆర్ఎస్ పార్టీలో నాలుగు వర్గాలు కొనసాగతున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ మండలాధ్య పదవిపై చర్చ కొనసాగుతుంది. జిల్లా ముఖ్య నేత ఒకరు ఈ పదవిని రాజన్నపేట శ్రీనివాస్కు ఇవ్వాలని కోరగా.. మంత్రి కేటీఆర్ ఈ పదవిని నర్సింహారెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జడ్పీటీసీ చీటీ లక్ష్మణ్రావు వర్గంపై.. మరో వర్గం చర్చలు ప్రారంభించారు. అధ్యక్ష పదవి విషయంలో మరోసారి మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లెందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే పలువురు నాయకులు మండలంలో గ్రూపు రాజకీయాలు నిర్వహిస్తూ ఎవరి కార్యక్రమాలు వారు వేరు వేరుగా చేస్తున్నారు. పైపైన మాట్లాడుకున్న రాజకీయ విబేధాలు అలానే ఉన్నాయని మండలంలో చర్చ కొనసాగుతుంది.

సెస్ ఉద్యోగుల బదిలీలు.. కరెంట్ కనెక్షన్ల కట్ వ్యవహారం

రాజన్నసిరిసిల్ల జిల్లా లో సెస్ అధికారులు ఎన్నడు లేని విధంగా కొత్త పాలకవర్గం ఆదేశాలతో .. విచ్చలవిడిగా పేదల ఇండ్లకు, దళిత, గిరిజన కాలనీల కరెంట్ కనెక్షన్లు కట్ చేసి విద్యత్ సరఫరాను నిలిపివేయడంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. విద్యుత్ బకాయిల పేరుతో ఉన్నఫలంగా నిరుపేదల ఇండ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తుండటంతో.. పలువురు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. విద్యుత్ సరఫరా నిలిపివేయ్యోద్దని మంత్రి కేటీఆర్ ఫోన్లు ఆదేశించినట్లు తెలిసింది. ఎన్నికలకు మూడు నెలల ముందే సెస్ ఉద్యోగుల బదిలీలు.. కరెంట్ కనెక్షన్లు కట్ చేసి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో అధికార బీఆర్ఎస్ పార్టీలోనే సెస్ పాలకవర్గం తీరుపై వ్యతిరేఖ చర్చ నడుస్తుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు మంత్రి కేటీఆర్ విదేశి పర్యటన అనంతరం ఒక నిర్ణయానికి రానున్నారు. బదీలిల విషయం కనీసం జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలకు సూచనప్రయంగా కనీసం సమాచారం లేకపోవడం ఏంటని పలువురు పేర్కొంటున్నారు.

ఏది ఏమైన ప్రభుత్వానికి, మంత్రి కేటీఆర్కు తలవంపులు, నష్టాలు తెచ్చేనాయకుల మాటలను అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మంత్రి కేటీఆర్ ఇటువంటిపై సిరియస్గా స్పందించి.. ఆ నాయకులకు దిశానిర్ధేశం చేయాల్సిన అవసరం ఎంతైన ఉందని ప్రజలు కోరుతున్నారు.