సింగారంలో కంటి వెలుగు కేంద్రం ప్రారంభం

సింగారంలో కంటి వెలుగు కేంద్రం ప్రారంభం

కంటి లోపం ఉన్నవారు అందరూ సద్వినియోగం చేసుకోవాలి - ఎంపిపి పిల్లి రేణుక కిషన్

ముద్ర,ఎల్లారెడ్డిపేట :  రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో గురువారం కంటి వెలుగు కేంద్రాన్ని ఎల్లారెడ్డిపేట ఎంపిపి పిల్లి రేణుక కిషన్, సర్పంచ్ మంగోళీ నర్సాగౌడ్, ఎంపిటీసీ సభ్యులు సింగారం మధు లు కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎంపిపి పిల్లి రేణుక కిషన్ మాట్లాడుతూ  సింగారం గ్రామప్రజలు కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టని కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా  వ్యాయప్రయాసాలకు  ఓర్చి పేద ప్రజలకోసం తెలంగాణ రాష్ట్రం లో  చేపట్టారని అన్నారు.వైద్యులు పరీక్షలు చేసి అవసరమున్న వారికి కంటి అద్దాలు మందులు  అందజేస్తారన్నారు.వైద్యాధికారి చిరంజీవి సర్పం చ్ నర్సాగౌడ్ కు ఎంపిపి పిల్లి రేణుక కిషన్ కు సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హారి కి   కంటీ పరీక్షలు చేసి కంటి వెలుగు ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి,  సెస్ డైరెక్టర్ కృష్ణ హరి , వైద్యాధికారి డాక్టర్  చిరంజీవి ,ఉపసర్పంచ్ ఉస్మాన్ బాయి , పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, బిఆర్ ఎస్ పార్టీ నాయకులు వాసరవేణి దేవరాజు, గొల్ల పెల్లి సురేష్, గనగోని భంటీ గౌడ్, శ్రీనివాస్, మంగోళీ రాజు , గనగోని దేవరాజు , వైద్య సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.