నాణ్యమైన అత్యున్నత విద్య కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరండి - అగ్రహారం డిగ్రీ కళాశాల అధ్యాపకుల ప్రచారం

నాణ్యమైన అత్యున్నత విద్య కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరండి - అగ్రహారం డిగ్రీ కళాశాల అధ్యాపకుల ప్రచారం

ముద్ర, రుద్రoగి: ఉద్యోగ ఉపాధి అవకాశాలకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించడంతోపాటు,నాణ్యమైన అత్యున్నతమైన డిగ్రీ విద్య కోసం అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరండి అంటూ అధ్యాపకులు ప్రచారాన్ని నిర్వహించారు.బుధవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం,చందుర్తి మండలం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల పరీక్ష కేంద్రాలను సందర్శించి విద్యార్థులకు కరపత్రాలను పంపిణీ చేయడం ద్వారా అధ్యాపక బృందం సభ్యులు- కామర్స్ విభాగాధిపతి డాక్టర్ ఎం. మల్లారెడ్డి ,కీర్తి రాజేష్,  రమేశ్ శర్మలు ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 36 సంవత్సరాల సుదీర్ఘ అకాడమిక్ ఎక్సలెన్స్ కలిగి, నాక్ అక్రిడేషన్, ఐఎస్ఓ సర్టిఫికెట్ కలిగిన ఏకైక కళాశాల అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అని, విశాలమైన డిజిటల్ తరగతి గదులు, డాక్టరేట్ నెట్ సెట్ అర్హతలతో సుదీర్ఘ అనుభవం కలిగిన అధ్యాపకులు, డిజిటల్ తరగతుల ద్వారా విద్యా బోధన, డిజిటల్ లైబ్రరీ ఈ కళాశాల ప్రత్యేకతలని పేర్కొన్నారు. విద్యార్థులలో సామాజిక సేవను పెంపొందించడానికి ఎన్ఎస్ఎస్, పరిశోధన వైపు ప్రోత్సహించడానికి జిజ్ఞాస, విద్యార్థులలోని ప్రతిభను వెలికి తీయడానికి యువతరంగం వంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. టీఎస్ కేసి ద్వారా విద్యార్థులలో నైపుణ్యాలను పెంపొందింపజేసి జాబ్ మేళా ద్వారా వారికి ఉద్యోగ అవకాశాలను కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. అకాడమిక్ ప్రతిభ కనబరిచిన వారికి గోల్డ్ మెడల్ ప్రధానం నగదు ప్రోత్సాహం యూనివర్సిటీ టాపర్లకు లాప్ టాప్ లు ప్రధానం చేయబడుతుందని పేర్కొన్నారు. విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏకైక చిరునామా అని వారు పేర్కొన్నారు. ప్రచారం నిర్వహించిన అధ్యాపకులను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వడ్లూరి  శ్రీనివాస్ అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కామర్స్ విభాగాధిపతి డాక్టర్ మల్లారెడ్డి ఫిజిక్స్ అధ్యాపకులు కీర్తి రాజేష్, రమేశ్ శర్మ, రుద్రంగి కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ నవీన్ చందుర్తి కళాశాల ఇంఛార్జి ప్రిన్సిపల్ మోహన్ అధ్యాపకులు కృష్ణ, రాజు, శ్రీనివాస్, సుమన్ తదితరులు పాల్గొన్నారు