ABVP Protest: మోడల్ స్కూల్ ముందు ఏబీవీపీ నిరసన

ABVP Protest: మోడల్ స్కూల్ ముందు ఏబీవీపీ నిరసన
ABVP protest in front of Model School

ముద్ర, ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి  మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ ముందు సోమవారం తెలంగాణ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో ఏబీవీపీ  విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. మోడల్ స్కూల్లో ఉన్న సమస్యలపై రంజిత్ కుమార్ ప్రెస్ నోట్ విడుదల చేస్తూ విద్యార్థులకు టాయిలెట్స్ సరిపోవడంలేదని, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని, పూర్తిస్థాయిలో టీచర్స్ ను  నియమించాలని లేఖలో పేర్కొన్నారు.

విద్యార్థులకు బెంచీలు లేక నేలపైనే కూర్చుంటున్నారని అదేవిధంగా  కేజీబీవీ కి వెళ్లడానికి దారి లేదని వర్షాకాలంలో కాలువను దాటుకుంటూ రావాల్సి వస్తుందని విద్యార్థులకు ఏదైనా ప్రమాదం జరుగుతే పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ అక్కం నాగరాజు, వంశీ, గణేష్, అశోక్, అనిల్, రాకేష్, అజయ్, షబ్బీర్, సాయికుమార్, వంశీ నవీన్ తదితరులు పాల్గొన్నారు.