హత్య కేసులో ఒకరికి యావజ్జీవ కారాగార శిక్ష, ఇంకొకరికి 3 సంవత్సరాల జైలు శిక్ష 

హత్య కేసులో ఒకరికి యావజ్జీవ కారాగార శిక్ష, ఇంకొకరికి 3 సంవత్సరాల జైలు శిక్ష 

సిరిసిల్ల టౌన్, ముద్ర: రాజన్న సిరిసిల్ల జిల్లా కోర్ట్ ప్రాసిక్యూషన్ తెలిపిన వివరాల మేరకు తేది: 02.03.2018 నాడు రామారావుపల్లి (గ్రామం), చందుర్తి ( మండలం) కి చెందిన లింగంపల్లి కిట్టు (వెంకటేష్) అనే వ్యక్తి  చెల్లి ప్రియాంకను లింగంపల్లి లింగయ్య కొడుకు అయిన లింగంపల్లి అనిల్  ప్రేమ వివాహం చేసుకొన్నాడు. ఈ వివాహం వలన వారి పరువు పోయింది అని భావించిన కిట్టు లింగంపల్లి లింగయ్యను గొడ్డలితో తలపై కొట్టగా లింగయ్య అక్కడికక్కడే మృతి చెందగా, కిట్టు తండ్రి ఏ2 : లింగంపల్లి రాజయ్య, ఏ3 : లింగంపల్లి రాజవ్వ, ఏ4 : లింగంపల్లి రవళి, ఏ5 : డప్పుల జలెందర్, ఏ6 : లింగంపల్లి శ్రీనివాస్, ఏ7 : లింగంపల్లి విజయ్ లు అందరూ కలిసి లింగయ్యను, భార్య లింగంపల్లి రాజవ్వ, తండ్రి పోచయ్య లను కర్రలతో, చేతులతో కొట్టారని వారిపై లింగంపల్లి రాజవ్వ పిర్యాదు చేయగా అప్పటి ఎస్.ఐ మల్లేష్ గౌడ్ కేసు నమోదు చేయగా సి.ఐ విజేయ్ కుమార్ కేసు పరిశోధన ప్రారంభించి నిందితులను అరెస్ట్ చేసి జ్యూడిషియల్ రిమాండ్ కి తరలించారు. తదుపరి పరిశోధన పూర్తి చేసి కోర్టు లో చార్జిషీట్ దాఖలు చేయడం జరిగింది.
కోర్టు మానిటరింగ్ సిస్టం ఎస్.ఐ శ్రీకాంత్ పర్యవేక్షణ లో కోర్టు కానిస్టేబుల్ తిరుపతి, లతీఫ్ లు, సిఎంఎస్ కానిస్టేబుల్ నరేందర్ సాక్షులను కోర్టు నందు హజరు పరచగా, పి పి నర్సింగా రావు ప్రాసిక్యూషన్ తరపున వాదనలు వినిపించగా ఏ1, ఏ2 ల పై కేసు రుజువు అయినందున పిఆర్ఎల్. జిల్లా, సెషన్స్ జడ్జి ఎన్ ప్రేమలత ఏ1: లింగంపల్లి కిట్టు (వెంకటేష్) కి జీవిత ఖైదు తో పాటు రూ.1000/- జరిమానా, ఏ2 : లింగంపల్లి రాజయ్య కి 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.1000/- జరిమానా విధించారు. మిగతా నిందితులు ఏ3 నుండి ఏ7 ల పై కేసు కొట్టివేసినారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీస్ అధికారులను, ప్రాసిక్యూషన్ సమయంలో సహకరించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను, సిఎంఎస్ ఎస్.ఐ శ్రీకాంత్, కోర్టు కానిస్టేబుళ్లు తిరుపతి,లతీఫ్ లు, సిఎంఎస్ కానిస్టేబుల్ నరేందర్ లను అభినందించారు.