ఇద్దరికి చూపునిచ్చిన యువకుడు

ఇద్దరికి చూపునిచ్చిన యువకుడు

నేత్రాలను సేకరించిన సదాశయ ఫౌండేషన్‌

ముద్ర ప్రతినిధి : గోదావరిఖని అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకున్న ఓ యువకుడు, తన నేత్రాలను దానం చేసి ఇద్దరు అంధులకు వెలుగులు ప్రసాదించారు గోదావరి ఖని మారుతినగర్ కు చెందిన వంగరి సతీష్(39) అనే యువకుడు ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేస్తుండే వాడు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న సతీష్, బుధవారం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతు నేత్రాలను దానం చేయడానికి భార్య సుమలత, తల్లిదండ్రులు రాజయ్య, రాజేశ్వరి, సోదరులు సురేష్, రాజేష్ ముందుకు వచ్చారు. సదాశయ ఫౌండేషన్ ప్రతినిధి కే.ఎస్.వాసు, టెక్నీషియన్ ఎండీ.ఆరిఫ్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి సేకరించిన నేత్రాలను, హైదరాబాద్ లోని వాసన ఐ బ్యాంక్ కు తరలించారు. ఆత్మీయున్ని కోల్పోయిన దుఃఖంలో కూడా మరో ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించడానికి అంగీకారం తెలిపిన కుటుంబ సభ్యులను సదాశయ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు టి. శ్రావణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి సీఎచ్.లింగమూర్తి, రాజమౌళి, నూక రమేష్, జిల్లా అధ్యక్షుడు భీష్మాచారి, అన్నపూర్ణ, రామగుండం లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు తానిపర్తి విజయలక్ష్మి తదితరులు అభినందించారు.  నేత్రదాత ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమన్నారు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తే, చికిత్స పొందాలని, స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో మామిడాల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.