ఉద్విగ్న క్షణాలు

ఉద్విగ్న క్షణాలు

చంద్రయాన్ 3 సక్సెస్
చరిత్ర సృష్టించిన భారత్
 ఆనందంతో హర్షాతిరేకాలు
ప్రజలంతా టీవీల ముందే
జిల్లా అంతట విజయోత్సవ సంబరాలు

క్షణం క్షణం ఉత్కంఠ, ఉద్వేగం, ఉద్విగ్న క్షణాలు గడిపిన ప్రజలకు విక్రమ్ ల్యాండర్ చంద్రుడు పై అడుగుపెట్టగానే ఒక్కసారిగా ఆనందంతో చిందులు వేశారు. ఇస్రో చైర్మన్ చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైందని ప్రకటించడంతో శాస్త్రజ్ఞులపై ప్రశంసల జల్లు కురిపించారు.

ప్రజలంతా టెలివిజన్ల ముందు కూర్చొని అపూర్వ ఘట్టాన్ని వీక్షించారు.చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతంతో అంతరిక్ష కేంద్రంలో భారత సరికొత్త రికార్డు సృష్టించింది. చంద్రుడి దక్షిణ దృవం పై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. ఈ చారిత్రక క్షణాలను వీక్షించడానికి ప్రైవేట్ విద్యాసంస్థలు తోపాటు ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో లైవ్ టెలికాస్ట్ ను ఏర్పాటు చేశారు. జిల్లా అంతట విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. యువత కేరింతలు కొడుతూ వారి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు.