అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి జిల్లా అధ్యక్షుడుగంగాడి కృష్ణా రెడ్డి

అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి జిల్లా అధ్యక్షుడుగంగాడి కృష్ణా రెడ్డి

ముద్ర, వీణవంక: ఇటీవల అకాల వర్షం వలన దెబ్బతిన్న మొక్కజొన్న, వరి పంటలను జిల్లా అధ్యక్షుడు  గంగాడి కృష్ణా రెడ్డి వీణవంక మండలంలోని  దెబ్బతిన్న పంటపలను పరిశీలించి రైతులను పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ...కేసీఆర్ ప్రభుత్వం గత  తొమ్మిది సంవత్సరాల కాలంలో అనేక సార్లు అకాల వర్షాలు పడి  అనేక పంటలు దెబ్బతిని  నష్టం జరిగిన  సందర్భాల్లో అధికారులు నామమాత్రంగా పరిశీలించడం తప్పా .. పంటల నష్టం పై ప్రభుత్వానికి నివేదికలు పంపి రైతులకు నష్ట పరిహారం చెల్లించిన రోజులు లేవన్నారు.ప్రధామంత్రి ప్రారంభించిన ఫసల్ భీమా యోజన పథకం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి ఉంటే నేటి ఇలాంటి సంఘటనలు సంభవించినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు రైతులకు డబ్బులు చెల్లించేవన్నారు.నష్ట పోయిన  రైతుకు ప్రతి ఎకరాకు  యాబై  వేల నుండి అరవై వేల రూపాయలు నష్టపరిహారం కింద ఇవ్వాలన్నారు.ఇప్పటికైనా అధికారులు పంటల నష్టం పై సర్వే చేసి ప్రభుత్వానికీ నివేదికలు అందించి నష్టపోయిన రైతన్నలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు అన్నాడి రాజి రెడ్డి , రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి కృష్ణారెడ్డి , జిల్లా ఉపాధ్యక్షులు  ఎర్రబెల్లి సంపత్ రావు,హుజురాబాద్ అసెంబ్లీ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి , జిల్లా కార్యదర్శి నరసింహ రాజు ,కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మడుగగూరి సమ్మిరెడ్డి ,బీజేవైఎం జిల్లా కార్యదర్శి చేపూరి రాజు,అల్లపు రెడ్డి దేవేందర్ రెడ్డి, ఆలేటి శ్రీనివాస్ రెడ్డి,వెంకటేష్ తో పాటు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు