తప్పని నిరసనస సెగ...    

  •    పోలీసుల ప్రమేయంపై గ్రామస్తుల ఆగ్రహం...
  •    అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన...

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: నాగర్ కర్నూల్. నియోజకవర్గంలోని బిజినపల్లి మండలం వట్టెం గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డికి గురువారం నిరసన సెగ తగిలింది గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు గ్రామానికి నాయకులు కార్యకర్తలు కలిసి వెళ్లగా గ్రామస్తులు తమకు ఇచ్చిన రెండు పడక గదుల హామీ నిర్మాణం ఏమైందని భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని నిలదీయడంతో వివాదం మొదలుకుంది దీంతో పోలీసులు జోక్యం చేసుకొని చేదరగొట్టడంతో గ్రామస్తులు అంబేద్కర్ విగ్రహం ముందు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణం సమయంలో తమను ఆదుకుంటామని హామీ ఇచ్చి నెరవేర్చలేదని. అర్హులైన వారికి రెండు పడక గదిలో నిర్మాణం చేపట్టి పంపిణీ చేస్తామని ఇంతవరకు నిర్మాణాలను ప్రారంభించకపోవడం పై నిలదీశారు పోలీసుల పహారాలో కార్యక్రమాన్ని ముగించుకొని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అక్కడి నుండి బయలుదేరారు.