ఫుల్ జోష్ తో సీఎం కప్‌ జిల్లాస్థాయి క్రీడ పోటీలు ముగిశాయి

ఫుల్ జోష్ తో సీఎం కప్‌ జిల్లాస్థాయి క్రీడ పోటీలు ముగిశాయి
  • నాగర్ కర్నూల్ క్రీడా పోరాట పటిమను రాష్ట్రస్థాయిలో క్రీడల్లో చూపాలి - అదనపు కలెక్టర్ మోతిలాల్
  •  బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో అట్టహాసంగా సాగిన క్రీడా సంబురం
  • ఆటలాడి ఉత్సాహం నింపిన అదనపు కలెక్టర్ జిల్లా స్పోర్ట్స్ అధికారి
  • నువ్వా నేనా అన్నట్లు దూసుకెళ్లిన క్రీడాకారులు
  • రాష్ట్రస్థాయిలో సత్తా చాటనున్న 21 టీములు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: ‘సీఎం కప్‌' పోటీలు క్రీడాకారుల్లో ఫుల్‌ జోష్‌ నింపాయి. మండల స్థాయిలో ప్రతిభచూపిన వారితో బుధవారం సాయంత్రం  జిల్లాకేంద్రాలో జిల్లాస్థాయి టోర్నమెంట్లు ముగిశాయి. 
 ఈ పోటీలు 86 జట్లతో అట్టహాసంగా  మూడు రోజుల పాటు సాగిన క్రీడా పండుగలో 1000 మంది పాల్గొననున్నారు.
గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్‌ టోర్నీ నిర్వహిస్తోందని నాగర్ కర్నూల్ జిల్లా రెవెన్యూ ఆదనపు కలెక్టర్ సభావట్ మోతిలాల్ అన్నారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో జిల్లా స్థాయిలో వాలీబాల్‌, అథ్లెటిక్‌, ఫుట్‌బాల్‌, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్‌ పోటీలు జరిగాయి.ప్రతిభ చూపిన క్రీడాకారులతో రాష్ట్రస్థాయిలో 11 క్రీడాంశాలలో పాల్గొనేందుకు 21 జట్లను ఎంపిక చేశారు.ఈనెల 28వ తేదీన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో నాగర్ కర్నూలు జిల్లా నుండి విద్యార్థులు క్రీడా ప్రతిభను చూపనున్నారు.
సీఎం కప్ ముగింపు సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ ఎస్ మోతిలాల్ హాజరై ఆయన మాట్లాడుతూ-మూడు రోజులపాటు జిల్లా స్థాయి క్రీడలను ఘనంగా నిర్వహించిన జిల్లా యువజన క్రీడల శాఖ అధికారిని ఆయన అభినందించారు.

నాగర్ కర్నూల్ జిల్లా క్రీడాకారులలో ప్రతిభతో పాటు పోరాట పటిమ పుష్కలంగా ఉంటుందని ఆ పోరాట పటిమతో రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా విద్యార్థులు సట్టా చాటాలన్నారు.
జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చేలా కృషి చేయాలన్నారు.
క్రీడారంగంలో ప్రతిభ రాణించేందుకు చదువుతో పనిలేదని సచిన్ టెండూల్కర్ పదవ తరగతి ఫెయిల్ అయినప్పటికీ తన క్రీడా ప్రతిభతో ప్రపంచాన్ని గుర్తింపు తెచ్చుకున్నాడన్నారు.
వివిధ క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.
జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి నటరాజ్ మాట్లాడుతూ-సీఎం కప్ టోర్నమెంట్ను జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో మండలాల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులతో జిల్లా స్థాయిలో గత మూడు రోజుల నుండి విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు.విజయవంతంగా క్రీడలు సాగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి నటరాజ్, స్కూల్ గేమ్ ఫెడరేషన్ కార్యదర్శి పాండు, ఒలంపిక్ రాష్ట్రస్థాయి అబ్జర్వర్ యాదయ్య గౌడ్, వ్యాయామ ఉపాధ్యాయులు సీతారాం నాయక్, నిరంజన్, సామ రమేష్, శేఖర్ బాబు, సుభాషిని, రామన్ గౌడ్, శిరీష స్వరూప చంద్రకళ మల్లయ్య పర్వతాలు, జ్ఞానేశ్వరి, వెంకటేష్, సూర్యనారాయణ వెంకటేశ్వర శెట్టి,తదితరులు పాల్గొన్నారు.